పాత నేరస్తుడు అరెస్ట్

25 Dec, 2015 00:12 IST|Sakshi

రూ.4,60,000 విలువచేసే బంగారు
 ఆభరణాలు స్వాధీనం
 విజయనగరం క్రైం: జిల్లా కేంద్రంలోని టూ టౌన్ పోలీసు స్టేషన్ పరిధి మహలక్ష్మీనగర్‌లో  దొంగతనానికి పాల్పడిన పాత  నేరస్తుడు తాలాడ పద్మనాధంను (పట్టణంలోని బొదిల గూడెంనకు చెందిన వ్యక్తి) అరెస్ట్ చేసినట్లు సీసీఎస్ డీఎస్పీ ఎ.ఎస్.చక్రవర్తి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు విషయూలు వెల్లడించారు.  బుధవారం రాత్రి పట్టణంలో అనుమానస్పదంగా తిరుగుతుండగా పద్మనాభంను అదుపులోకి తీసుకుని విచారించగా, పలు దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడన్నారు.
 
 అతని నుంచి రూ.4.60,000 విలువ చేసే 189.900 గ్రాముల బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. బంగారు పుస్తెలతాడు, రెండు బంగారు గాజులు, రెండు బంగారు నల్లపూసల దండలు, నెమలి ఆకృతి బంగారు గాజు, బంగారు చంద్రహారం, 11 జతల బంగారు చెవిదిద్దులు, 10 తులాల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. దొంగను పట్టుకోవడంలో సీసీఎస్ సీఐలు ఎం.వీరకుమార్, బి.నర్సిం హమూర్తి, టూటౌన్ సీఐ సీహెచ్.శ్రీధర్,  ఎస్‌ఐ  శ్రీధర్, సీసీఎస్ ఎస్‌ఐ ఐ.సన్యాసిరావు, సిబ్బంది సహకరించాలని తెలిపారు.  
 

మరిన్ని వార్తలు