స్తంభించిన బ్యాంకింగ్ సేవలు

3 Dec, 2014 02:52 IST|Sakshi

కొరిటెపాడు(గుంటూరు): వేతన సవరణ అమల్లో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు దిగటంతో జిల్లాలో మంగళవారం బ్యాంకింగ్ సేవలు పూర్తిగా స్తంభించారుు. జిల్లాలోని 27 ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన 500 బ్రాంచిల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులు సమ్మెలో పాల్గొనటంతో దాదాపు రూ.150 కోట్ల మేర లావాదేవీలు నిలిచిపోయూరుు.
 
 ఏటీఎంలలో తగినంత నగదును ముందుగానే పెట్టడంతో సాధారణ ఖాతాదారులకు పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదు. సమ్మె నుంచి సహకార రంగ బ్యాంకులను మినహాయించడంతో ఆయూ బ్యాంకుల బ్రాంచిల్లో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాలతోపాటు గుంటూరు నగరంలోని పట్టాభిపురం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొరిటెపాడులోని ఆంధ్రాబ్యాంక్ బ్రాంచిల వద్ద యూనియన్ల నేతలు, ఉద్యోగులు పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.

వందలాది మంది ఎస్‌బీఐ ఉద్యోగులు నగరం పాలెంలోని ప్రధాన బ్రాంచి నుంచి పట్టాభిపురంలోని బ్రాంచి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కొరిటెపాడు ఆంధ్రాబ్యాంక్, పట్టాభిపురం ఎస్‌బీఐ శాఖల వద్ద జరిగిన సభల్లో ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ వేతన సవరణపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. వేతన సవరణను వెంటనే అమలు చేయకపోతే నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు.
 

>
మరిన్ని వార్తలు