రాజుగారిని విమానమెక్కించారు!

27 May, 2014 17:46 IST|Sakshi
రాజుగారిని విమానమెక్కించారు!
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చెప్పలేనంత దారుణంగా మారింది. రాజధాని ఎక్కడో.. ఆదాయ వనరులేంటో కూడా తెలియని పరిస్థితి. రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. ఇంకా చెప్పలేనన్ని సమస్యలతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలు అల్లాడుతున్నారు. అయితే కేంద్రమంత్రి వర్గంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి మేలు చేసే శాఖలు లభిస్తాయని ఆప్రాంత ప్రజలు ఆశగా ఎదురు చూశారు. 
 
అయితే సీమాంధ్ర ప్రయోజనాలకు ఉపయోగపడే శాఖను కేంద్ర ప్రభుత్వంలో దక్కించుకోవడంలో టీడీపీ విఫలమైందనే వాదన వినిపిస్తోంది. వ్యవసాయం, ఎరువులు, భారీ పరిశ్రమలు, రైల్వే , రసాయన శాఖల్లాంటివి కాకుండా అశోక్ గజపతి రాజుకు పౌర విమానమానం శాఖను కేటాయించడం సీమాంధ్రకు ఎలాంటి మేలు చేస్తుందనే విమర్శలు వస్తున్నాయి. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ తెలుగుదేశం పార్టీకి ఓ శాఖతో సరిపెట్టారు.  అయినా సీమాంధ్ర ప్రాంత అభివృద్దికి తోడ్పాటునందించే శాఖను టీడీపీ దక్కించుకోలేకోపోయిందనే వాదన వినిపిస్తోంది. 
 
మోడీ ప్రభుత్వంలో తెలుగు వారని చెప్పుకునే వెంకయ్యనాయుడు కర్నాటక నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా, నిర్మలా సీతారామన్ కు పార్లమెంట్ లో సభ్యత్వం లేకుండానే మంత్రి పదవిని కట్టబెట్టారు. కొంతలో కొంత వెంకయ్య పట్టణాభివృద్ది శాఖ, నిర్మలాకు వాణిజ్యం, పరిశ్రమలు దక్కడం కొంత ఊరటగా భావిస్తున్నారు. 
మరిన్ని వార్తలు