సీపీఎస్‌ రద్దుకు ఏయూ ఉద్యోగుల వినతి

12 Sep, 2018 06:59 IST|Sakshi
జగనన్నతో సెల్ఫీ

విశాఖపట్నం :సీపీఎస్‌ రద్దుకు సహకరించాలని ఆంధ్రవిశ్వవిద్యాలయం కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ ఎంప్లాయిస్‌ ప్రతినిధులు జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. ఆయనకు వినతిపత్రం అందించిన వారిలో ఏయూ ప్రతినిధులు పి.సాంబమూర్తి, డాక్టర్‌ జానకీరామ్, ప్రొఫెసర్‌ కోటిరెడ్డి, డాక్టర్‌ ప్రేమానంద్, భైరాగిరెడ్డి, పద్మకల్యాణి, ఆదిలక్ష్మి తదితరులు ఉన్నారు.

ప్రార్థనలు చేశాం
మాది విశాఖపట్నంలో చినవాల్తేరు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రార్థన చేశాం. విశాఖపట్నంలోని కేథలిక్‌ ప్రీస్ట్, బాప్టిస్ట్‌ పాస్టర్స్, సంఘ పెద్దలం ప్రజా సంకల్పయాత్రకు వచ్చాం. భగవంతుడి దీవెనెలు ఆయనకు ఎప్పుడూ ఉండాలని ఆశీర్వదించాం.– ఫాదర్‌ భాస్కర్‌రెడ్డి, ఫాదర్‌ ఫాన్సిస్‌ స్టీఫెన్‌

జగన్‌కు మా మద్దతు
మాది విశాఖపట్నం అక్కయ్యపాలెం. ఆల్‌ ఇండియా ట్రూ క్రిస్టియన్‌ కౌన్సిల్‌ ట్రస్ట్‌ నుంచి వచ్చాం. మా ట్రస్ట్‌ ద్వారా సామాజిక కార్యక్రమాలు చేస్తుంటాం. మా ట్రస్ట్‌లో పనిచేస్తున్న సిబ్బంది, వారి కుటుంబసభ్యులందరూ వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీకే మద్దతు ఇస్తున్నాం. ప్రజాసంకల్పయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మా మద్దతు ప్రకటించడానికి వచ్చాం. ఆయన ముఖ్యమంత్రి కావాలి. 
   – ఏఐటీసీసీటీ ప్రతినిధులుపి.జీవన్‌బాబు, ఎస్‌.వేణు,జి.రవీంద్రదాస్, జి.వినయ్‌

ప్రసాదం అందజేత...
ప్రజా సంకల్ప పాదయాత్రలో ఉన్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మంగళవారం చినవాల్తేరులోని కనకమ్మ గుడి వద్ద ఆయన బస చేసిన ప్రదేశంలో పెందుర్తి శారదాపీఠానికి చెందిన బృందం కలిసి ప్రసాదం అందించారు. స్వామి స్వరూపానంద సరస్వతి సూచనల మేరకు ఏడుగురు బృందం గల సభ్యులు ఈ ప్రసాదం అందించినట్టు పీఠం ధర్మాధికారి కామేశ్వరరావు తెలిపారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అమీన్‌ పీర్‌ దర్గాను దర్శించుకున్న వైఎస్‌ జగన్‌

హార్టికల్చర్‌ విద్యార్థులకు వైఎస్‌ జగన్‌ భరోసా

వైఎస్‌ జగన్‌ అంటే ఒక నమ్మకం..

ఈ సంకల్పం.. అందరికోసం

‘వైజాగ్‌లో వైఎస్‌ జగన్‌ను స్వామివారే కాపాడారు’

పాదయాత్ర ముగింపు సభ చూసి టీడీపీ నేతలకు చెమటలు!

శ్రీవారిని దర్శించుకున్న వైఎస్‌ జగన్‌

ఉత్సాహం నింపిన సంకల్పం

సిక్కోలులో ‘తూర్పు’ సందడి

విజయోస్తు జగనన్న!

జన గర్జన

సీఎంగా చూడాలని ఆకాంక్ష..

గ్రామాభివృద్ధికి శ్రీకారం చుట్టాలి...

ప్రజల గుండెల్లో చెరగని ముద్ర

దివ్యాంగులను పట్టించుకోని టీడీపీ

ఆపరేషన్‌ చేయించి ఆదుకోండి..