చిరంజీవి రాజీనామా చేయాలి: ఏయూ విద్యార్ది జేఏసీ

4 Aug, 2013 11:51 IST|Sakshi

రాష్ట విభజనను వ్యతిరేకిస్తూ, సమైక్యాంధ్రకు మద్దతుగా కేంద్రమంత్రి చిరంజీవి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఏయూ విద్యార్థి జేఏసి ఆదివారం విశాఖపట్నంలో డిమాండ్ చేసింది. చిరంజీవి ఫ్యామిలి నటించిన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసుకోవచ్చు,కానీ రాష్టంలో విడుదల కాకుండా అడ్డుకుంటామని ఏయూ జేఏసీ విద్యార్థలు ఈ సందర్భంగా హెచ్చరించింది. విద్యార్థుల దీక్షా శిబిరాన్ని స్థానిక టీడీపీఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆదివారం సందర్శించారు. అనంతరం వారికి తన సంఘీభావాన్ని ప్రకటించారు.

అలాగే విశాఖపట్నం తొలి పార్లమెంట్ సభ్యుడు కేఎస్ తిలక్ కూడా ఏయూ విద్యార్థి దీక్షా శిబిరాన్ని సందర్శించారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ తొందరపడిందన్నారు. ఉద్యమాలతో అట్టుడుకుతున్న ఆంధ్రప్రదేశ్ను చూడలేకున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సమైక్యాంధ్రకు మద్దతుగా విశాఖ నగరంలో ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. మద్దలెపాలెం వద్ద ఆందోళనకారులు ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. ఏయూ విద్యార్థి జేఏసీ చేస్తున్న నిరాహార దీక్ష ఆదివారం ఆరో రోజుకు చేరింది.

మరిన్ని వార్తలు