సీఎం జగన్‌ను కలిసిన ఆస్ట్రేలియన్‌ ప్రతినిధుల బృందం

25 Jul, 2019 18:28 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆస్ట్రేలియా కాన్సులేట్‌ జనరల్‌ సూసన్‌ గ్రేస్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌లో వైఎస్‌ జగన్‌తో సూసన్‌ గ్రేస్‌ నేతృత్వంలో వివిధ రంగాలకు చెందిన 22మంది ప్రతినిధులు భేటీ అయ్యారు. గనులు, ఇంధనం, లిథియం బ్యాటరీల తయారీ, విద్య, లాజిస్టిక్స్, విమానాశ్రయాల నిర్వహణల్లో పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. రెండురోజులపాటు రాష్ట్రంలో పర్యటించిన ఆస్ట్రేలియా బృందం వివిధ శాఖల మంత్రులను, కార్యదర్శులను, పారిశ్రామికవేత్తలను కూడా కలుసుకుంది. పారశ్రామిక రంగం అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆస్ట్రేలియన్‌ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అందిస్తున్న పారదర్శక పాలన, పారిశ్రామిక రంగానికి మరింత మేలు చేస్తుందని ఆస్ట్రేలియన్‌ బృందంతో సీఎం వ్యాఖ్యానించారు. కాలుష్యం తగ్గించడానికి, మెరుగైన రవాణా కోసం ఎలక్ట్రిక్‌ బస్సులను వవేశపెట్టడానికి ఆసక్తితో ఉన్నామని, దానిపై ఆలోచన చేయాలని సీఎం కోరారు.

మరిన్ని వార్తలు