‘ఆర్థిక సాయానికి 25లోగా దరఖాస్తు చేసుకోండి’

20 Sep, 2019 16:42 IST|Sakshi

రవాణాశాఖ కార్యదర్శి కృష్ణబాబు వెల్లడి

సాక్షి, అమరావతి: ప్రభుత్వం అందజేయనున్న రూ.10 వేలు ఆర్థిక సాయానికి అర్హులైన ఆటో, ట్యాక్సీ డ్రైవర్లందరూ ఈ నెల 25 లోగా దరఖాస్తు చేసుకోవాలని రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు శుక్రవారం వెల్లడించారు. సొంతంగా ఆటో, ట్యాక్సీ ఉండి.. వారే నడుపుకునే వారికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈ ఆర్థిక సాయాన్ని అందించనున్న సంగతి తెలిసిందే. భార్య, భర్తను ఓ యూనిట్‌గా తీసుకుని సాయం అందిస్తారు. కొడుకు, కూతురు ఇదే వృత్తిలో ఉండి వివాహం కాకున్నా.. మేజర్లు అయితే చాలు.. వారిని మరో యూనిట్‌గా పరిగణిస్తారు. వారు కూడా ఆర్థిక సాయం పొం‍దడానికి అర్హులేనని రవాణాశాఖ కార్యదర్శి స్పష్టం చేశారు.
(చదవండి : ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ. 400 కోట్లు)

వర్షాలు తగ్గిన తర్వాత 160 కోట్ల రూపాయలతో రోడ్ల మరమ్మతులు చేపడుతామని తెలిపారు. 86 వేల దరఖాస్తులు ఆన్‌లైన్‌లో.. 40 వేల దరఖాస్తులు ఆఫ్‌లైన్‌లో అందాయని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో లైసెన్స్‌ తీసుకుని ఆంధ్రప్రదేశ్‌లో ఆటో, ట్యాక్సీలు నడుపుకునే వారు కూడా ఈ ఆర్థిక సాయానికి దరఖాస్తు చేసుకోవచ్చని కృష్ణబాబు వెల్లడించారు. అక్టోబర్‌ 4 నుంచి అర్హులైన ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల బ్యాంకు ఖాతాల్లో నగదు డిపాజిట్‌ అవుతుందని చెప్పారు.
(వచ్చే నెల 4 నుంచి ఆటో, ట్యాక్సీ వాలాలకు రూ.10 వేలు)

మరిన్ని వార్తలు