హోంగార్డు కొట్టాడని.. డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం

6 Nov, 2019 15:03 IST|Sakshi

సాక్షి, గుంటూరు : నలుగురు చూస్తుండగా కొడుతూ, పోలీస్‌ స్టేషన్‌కి ఈడ్చుకెళ్లారనే బాధతో ఓ ఆటో డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మాచర్ల మండలం రాయవరంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. మాచర్ల పీఎస్‌లో పనిచేసే హోంగార్డు రాజేశ్‌, ఆటో డ్రైవర్‌ శ్రీనుతో ఉన్న వ్యక్తిగత గొడవలతో అతిగా ప్రవర్తిస్తూ, అతనిపై చెప్పులతో దాడి చేశాడు. అలాగే బజారులో కొట్టుకుంటూ స్టేషన్‌కి తీసుకెళ్లడంతో తీవ్ర మనస్థాపానికి గురైన శ్రీను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి బాధితుడిని తరలించారు. 

మరిన్ని వార్తలు