ట్రిపుల్ ఐటీలకు స్వయం ప్రతిపత్తి

17 Aug, 2014 03:15 IST|Sakshi

వేంపల్లె: వైఎస్‌ఆర్ జిల్లాలోని ఇడుపులపాయ, కృష్ణా జిల్లాలోని నూజివీడు, అదిలాబాద్ జిల్లాలో ఉన్న బాసరలో ఉన్న మూడు ట్రిపుల్ ఐటీలకు స్వయం ప్రతిపత్తి(అటానమీ) కల్పించారు. ఈనెల 14వ తేదీన హైదరాబాద్‌లోని ఆర్‌జీయూకేటీ ప్రధాన కార్యాలయంలో జరిగిన గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ట్రిపుల్ ఐటీలో పనిచేసే సిబ్బంది జీతాలు, నిర్వహణ ఖర్చులు, పరిపాలన వారే స్వయంగా చూసుకోవాల్సి ఉంటుంది. పర్యవేక్షణ మాత్రం వర్సిటీ పరిధిలో ఉంటుంది. విద్యార్థుల పరీక్ష విధానానికి వస్తే... ఆన్‌లైన్‌లో మూడు ట్రిపుల్ ఐటీల విద్యార్థులకు ఒకేసారి జరిగి ఫలితాలూ అలాగే విడుదలయ్యేవి. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. ఆ ట్రిపుల్‌ఐటీ పరిధిలో పరీక్ష విధానం, ఫలితాల విడుదల ఉండే అవకాశాలు ఉన్నాయి.  
 

>
మరిన్ని వార్తలు