నేటి అర్ధరాత్రి నుంచి ఆటోలు బంద్

17 Jan, 2014 01:07 IST|Sakshi
నేటి అర్ధరాత్రి నుంచి ఆటోలు బంద్

హైదరాబాద్‌లో సుమారు 1.20 లక్షల ఆటోలు ఆగిపోయే అవకాశం
ఇందులో 25 వేల స్కూల్ ఆటోలు
గ్రేటర్ పరిధిలో 1520 లక్షల మందికి ఇబ్బందులు

 
 సాక్షి, హైదరాబాద్:
పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా ఆటో చార్జీలు పెంచాలని, ట్రాఫిక్ చలానాలు రూ.1,000కి పెంచు తూ గత సంవత్సరం జారీ చేసిన జీవో 108ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటో సంఘాల జేఏసీ శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఆటో బంద్‌కు పిలుపునిచ్చిం ది. 16 ఆటో సంఘాల నేతృత్వంలో ఈ సమ్మె చేపట్టాలని నిర్ణయించినట్లు జేఏసీ ప్రతినిధులు బి.వెంకటేశం (ఏఐటీయూసీ), ఎ.సత్తిరెడ్డి (ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్ల సమాఖ్య), నరేందర్ (ఐఎఫ్‌టీయూ) గురువారం తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఆటో కనీస చార్జి రూ.16 నుంచి రూ.25 చేయాలని, ఆపైన ప్రతి కి.మీ.కి రూ.15కు పెంచాలని వారు డిమాండ్ చేశారు. భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్) బంద్‌కు దూరంగా ఉంది.
 
 ఆర్టీసీ అదనపు బస్సులు!
 ఆటో సమ్మె అనివార్యమైతే 100 బస్సులు అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు ఆర్టీసీ  ప్రకటించింది. సికింద్రాబాద్-ఆఫ్జల్‌గంజ్, లక్డీకాపూల్-వీఎస్‌టీ, రామ్‌నగర్-కోఠి, రామంతాపూర్-లక్డీకాపూల్, చార్మినార్-ఆఫ్జల్‌గంజ్, సనత్‌నగర్-లక్డీకాపూల్ వంటి  రూట్లలో  ఇవి అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ కోటేశ్వర్‌రావు తెలిపారు.
 

మరిన్ని వార్తలు