ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుంది : అవంతి

29 Sep, 2019 21:23 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు, ఉద్యోగులకిచ్చిన హామీలను సైతం నెరవేర్చారని తెలిపారు. విశాఖలో జరిగిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సమావేశానికి మంత్రి అవంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కార్‌రావు, విశాఖ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చంద్రరావు, ఎస్‌వీ రమణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగానే తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీపీఎస్‌ రద్దుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. 

గత ప్రభుత్వం మాదిరి తమ ప్రభుత్వం ఉద్యోగులను పీడించేది కాదన్నారు. ఉద్యోగుల డిమాండ్లపై తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడమే సీఎం వైఎస్‌ జగన్‌ ధ్యేయమని చెప్పారు. అధికారంలోని వచ్చిన మూడు నెలల్లోనే సీఎం వైఎస్‌ జగన్‌ విప్లవాత్మక మార్పులు తీసుకోచ్చారని గుర్తుచేశారు. వంద రోజుల్లోనే ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌దేనని అన్నారు.

మరిన్ని వార్తలు