మంచి పనులు చేయడానికి మనసుంటే చాలు

10 Feb, 2020 19:03 IST|Sakshi

సాక్షి, అమరావతి: మంచి పనులు చేయడానికి వయసు అవసరం లేదని, పెద్ద మనసుంటే చాలని.. అది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఉందని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. ఏకకాలంలో నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం జగన్‌దని కొనియాడారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు యువతను నిండా ముంచారని మండిపడ్డారు. బాబు వస్తే జాబు ఇస్తానంటూ మయామాటలు చెప్పారని ఆగ్రహించారు. చంద్రబాబుకు కృతజ్ఞతాభావం లేదని.. పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచాడని వ్యాఖ్యానించారు. టీడీపీని ఎన్నో ఏళ్ల నుంచి గెలిపించుకుంటూ వస్తున్న ఉత్తరాంధ్రను ఏమాత్రం అభివృద్ధి చేయలేదన్నారు. వెళ్తూ వెళ్తూ బాబు రాష్ట్రానికి రెండున్నర లక్షల అప్పిచ్చి వెళ్లారని విమర్శించారు. ఇప్పుడేమో తాము అభివృద్ధి చేస్తామని ముందుకొస్తే అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. (సిగ్గుమాలిన పార్టీ.. టీడీపీ)

ఆగిపోయిన పింఛన్‌దారులు భయపడక్కర్లేదు
‘రాష్ట్ర అభివృద్ధి జరగడానికే సీఎం జగన్‌ మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారు. వైజాగ్‌లో రాజధాని పెడితే మరో ముంబై నగరంగా మారుతుంది. ‘నవరత్నాలు’లో భాగంగా ఆరోగ‍్య శ్రీ, ఉచిత విద్య, వైఎస్సార్‌ రైతు భరోసా, అమ్మ ఒడి కార్యక్రమం ఒక్కోటి అమలు పరుస్తున్నాం. 43 లక్షల మంది తల్లులకు రూ.15 వేలు చొప్పున ఇచ్చాం. డ్వాక్రా మహిళలకు రుణమాఫీపై కూడా దృష్టి పెట్టాం. ఈసారి పోస్టుల్లో సగం మహిళలకే అందేలా చూస్తాం. పెన్షన్‌ల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఇంటింటికి తీసుకొచ్చి ఇస్తున్నాం. ఆగిపోయిన పింఛన్‌దారులు భయపడక్కర్లేదు. అధికారులతో మాట్లాడి రెండు నెలల పింఛన్‌లు అందిస్తాం. మత్స్యకారులు దేశానికి మరో సైనికులు.. అలాంటి జాలర్లకు, మత్స్యకారులకు రూ.10 వేల చొప్పున ఇచ్చా’మని మంత్రి శ్రీనివాస్‌ పేర్కొన్నారు.(‘ఆయన దేశం విడిచి వెళ్లే అవకాశం ఉంది’)

మరిన్ని వార్తలు