‘అరకు.. ప్రకృతి ప్రసాదించిన వరం’

29 Feb, 2020 20:03 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: అరకు ప్రకృతి ప్రసాదించిన వరమని, ఆంధ్రప్రదేశ్‌లో అరుకు ఉండటం మన అదృష్టమని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. అరకు ఉత్సవాలను మంత్రి అవంతి శ్రీనివాస్‌ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అరకు ఎంపీ మాధవి, ఎమ్మెల్యే చెట్టిఫాల్గుణ, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, టూరిజం ఎండీ ప్రవీణ కుమార్‌, పాడేరు ఐడీడీఏ పీవో బాలాజీ, పాడేరు సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్‌ పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా అవంతి శ్రీనివాస్‌ సాంప్రదాయ ఉత్పత్తులు, ఆహార వంటకాల స్టాల్స్‌ను ప్రారంభించారు. (ముగిసిన సీఎం జగన్‌, ముకేష్‌ అంబానీ భేటీ)

ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా అరకు అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. డాక్టర్లు రాని పాడేరుకు ఏకంగా మెడికల్ కాలేజీ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గిరిజనులు గొప్పగా దీవించాలన్నారు. ప్రజలు ముఖ్యమంత్రిని కావాలనుకుంటే త్వరలో విశాఖలోనే అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు. మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాలను సమ్మక్క-సారక్క ఉత్సవాల తరహాలో నిర్వహిస్తామని తెలిపారు. గిరిజనులు దేవతగా భావించే కొండలను కాపాడుతూ బాక్సైట్ తవ్వకాల అనుమతులను సీఎం జగన్‌ రద్దు చేశారని ఆయన గుర్తుచేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి గిరిజనులే పునాదులాన్నారు. పులకింతల అరకు

పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. గిరిజన సంప్రదాయాలను గౌరవిస్తూ పర్యాటక అభివృద్ధికి తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. అరకు ఉత్సవాలు గిరిజన సంస్కృతికి ఇచ్చే ప్రోత్సాహకమని ఆమె తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గిరిజన ప్రాంత అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని భాగ్యలక్ష్మి కొనియాడారు. బాక్సైట్ తవ్వకాల జీవో 97 రద్దు, పాడేరులో మెడికల్ కాలేజీ ఏర్పాటు, సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ, కురుపాంలో ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు చేశారని ఆమె తెలిపారు. కుదరకపోయినా ఓ కప్పు

అరకు ఎమ్మెల్యే చెట్టిఫాల్గుణ మాట్లాడుతూ.. అరకు ఉత్సవాలతో మన్యానికి అందం వచ్చిందన్నారు. గిరిజన ప్రాంత అభివృద్ధికి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందని తెలిపారు. అరకు పరిసరాల్లో ఉన్న ఎన్నో జలపాతాలను అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. తనకు ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్స్‌లో ప్రెగ్నెన్సీ ఉమెన్ హాస్టల్ ఏర్పాటు చేయడం ఎంతో ఆనందం కలిగించిందన్నారు. ఆంధ్రా ఊటి అరకు

మరిన్ని వార్తలు