అతిథ్య రంగానికి ఇది శుభవార్త: మంత్రి

2 Jun, 2020 15:37 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: లాక్‌డౌన్‌ సడలింపులతో జూన్‌ 8వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హరిత హైటల్స్‌ను తిరిగి ప్రారంభిస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకే హోటల్స్‌ తిరిగి ప్రారంభిస్తున్నామని స్పష్టం చేశారు. హరిత హోటల్స్‌కు ఆన్లైన్ బుకింగ్ వెసులుబాటు కూడా కల్పిస్తున్నామన్నారు. ఇది ఆతిథ్య రంగానికి శుభవార్త అన్నారు. అంర్జాతీయ స్ధాయిలో పర్యాటకులను అవినీతి రహితంగా ఆకట్టుకోవడానికి రాష్డ్ర వ్యాప్తంగా 12 పర్యాటక ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. గడిచిన ఏడాది పాలనలో పర్యాటక అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. (నిరూపిస్తే రాజీనామా చేస్తా: అవంతి సవాల్‌)

ఏడాది పాలనలో పర్యాటకుల సంఖ్య 21 శాతం పెరిగిందన్నారు. బోటింగ్ కార్యకలాపాల నియంత్రణ, భధ్రతకు రాష్ట్రంలో 9 ప్రాంతాలలో కంట్రోల్ రూమ్‌లు నిర్మించామన్నారు.  రాష్ట్రంలో ఆదాయ మార్గాలు పెంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. ఇందుకోసం ఫెస్టివల్స్, ఎగ్జిబిషన్‌ను కూడా నిర్వహిస్తుమని తెలిపారు. గండికోట వద్ద ఉన్న ఎడ్వేంజర్ స్టోర్స్‌కు కూడా  ఇతర రాష్ట్రాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారని, ఏపి పర్యాటక శాఖ జాతీయ స్ధాయి అవార్డులు కూడా అందుకుందన్నారు. అంతేగాక శిల్పారామాల అభివృద్దికి ప్రత్యేక ప్రణాళిక నిర్వచిస్తున్నామని, యువతలో దేశభక్తి పెంపొందించేందుకు యూత్ ఎక్చేంజ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు