‘ప్రపంచస్థాయిలో విశాఖను తీర్చిదిద్దుతాం’

10 Jul, 2020 14:33 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం:  పరిపాలనా రాజధానిగా విశాఖ నగరానికి అన్ని హంగులు సమకూర్చబోతున్నామని పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాసరావు   తెలిపారు. శుక్రవారం ఆయన భీమిలి‌ నియోజకవర్గంలోని మధురవాడ ప్రాంతంలో రూ. 4.5 కోట్ల అభివృద్ది పనులకి  శంఖుస్థాపనలు చేశారు. (విశాఖ బీచ్‌ కోతని అరికట్టేందుకు..)

ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ, ‘పూర్తి స్ధాయి మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాం. ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ గత ఏడాది విశాఖ నగరంలో రూ.1000 కోట్ల పైన అభివృద్ది పనులకి శ్రీకారం చుట్టారు. ఒక్క భీమిలి నియోజకవర్గంలోనే 17 కోట్లతో అభివృద్ది పనులు చేపడుతున్నాం. ఈ రోజు(శుక్రవారం) రూ. 4.5 కోట్లతో మధురవాడ ప్రాంతంలో అభివృద్ది పనులకి శంఖుస్థాపనలు చేశాం. విశాఖ నగరంలో మౌలిక వసతులపై దృష్టి పెట్టాం. అభివృద్ది చెందడానికి విశాఖ నగరానికి అన్ని అర్హతలు ఉన్నాయి. . రాబోయే రోజులలో విశాఖ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. విశాఖ నగరం 2019 కి ముందు...ఆ తర్వాత అన్న తేడాలను ప్రజలు స్పష్టంగా గుర్తిస్తారు. ఎయిర్ పోర్టు, మూడు పోర్టులు, రైల్వే డివిజన్...ఇలా అన్ని వసతులు ఉన్న నగరం విశాఖ పట్నం.  అంతర్జాతీయ నగరంగా విశాఖను తీర్చిదిద్దుతాం. 

(13 జిల్లాల్లో డి ఎడిక్షన్‌ సెంటర్లు ప్రారంభం)

మరిన్ని వార్తలు