సేంద్రీయ వ్యవసాయంతో అధిక దిగుబడులు

14 Aug, 2015 16:10 IST|Sakshi

ఆముదాలవలస (శ్రీకాకుళం జిల్లా) : సేంద్రీయ వ్యవసాయం చేయడం ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ స్పెషల్ ఛీప్ సెక్రటరీ విజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం ఆముదాలవలస మండలం నిమ్మతుర్లివాడ గ్రామంలో వ్యవసాయ జీడీ అప్పల స్వామి ఆధ్వర్యంలో జరిగిన సేంద్రియ వ్యవసాయంపై అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. రసాయనిక ఎరువుల వాడకం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు విషపూరితం అవుతున్నాయన్నారు. వీటిని వినియోగించిన ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆయన చెప్పారు. సేంద్రీయ ఎరువుల వాడకం ద్వారా నాణ్యమైన ఆహార పదార్థాలను ఉత్పత్తి చేయవచ్చని, తద్వారా ప్రజలు రోగాలకు దూరంగా ఉండవచ్చని ఆయన సూచించారు. పాడి పరిశ్రమలను రైతులు అభివృద్ధి చేయాలని ఆయన కోరారు.

మరిన్ని వార్తలు