‘బాబు’ విధానాలపై ప్రజలే తిరగబడతారు

30 Jan, 2015 03:15 IST|Sakshi
‘బాబు’ విధానాలపై ప్రజలే తిరగబడతారు
  • వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
  • తణుకులో రైతు దీక్ష ప్రాంగణ పరిశీలన  
  • తణుకు: ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు తిరగ బడి ఆయన్ను రాజకీయంగా భూస్థాపితం చేస్తారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఈనెల 31, ఫిబ్రవరి 1 తేదీల్లో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన రైతు దీక్ష ప్రాంగణాన్ని గురువారం విజయసాయిరెడ్డి పరిశీలించారు.

    అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా 1.30 కోట్ల మందికి పూర్తి స్థాయిలో పంట రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు కనీసం వడ్డీలో  మూడోవంతు కూడా మాఫీ చేయలేదన్నారు. రుణమాఫీ పేరుతో డ్వాక్రా మహిళలను మోసగించార ని పేర్కొన్నారు. రైతులు, డ్వాక్రా మహిళల విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతు దీక్షను చేపడుతున్నట్టు తెలిపారు.

    రాజధాని నిర్మాణం పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్కారు తీరుకు నిరసనగా వైఎస్ జగన్ ఈనెల 31న ఉదయం 10 గంటల నుంచి ఫిబ్రవరి 1వ తేదీ సాయంత్రం వరకూ నిరాహార దీక్ష చేయనున్నట్టు ఆయన వివరించారు. మాజీ మంత్రి  కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన రైతు దీక్షకు స్వచ్ఛందంగా తరలిరావడానికి రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు  ఆసక్తి కనబరుస్తున్నారన్నారు.

    వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ ఆస్పత్రులలో స్వైన్ ఫ్లూ మందులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.అంతకుముందు దీక్షాస్థలిలో ఏర్పాట్లను నాయకులు పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కారుమూరి వెంకటనాగేశ్వరరావు, కార్యదర్శులు లేళ్ల అప్పిరెడ్డి, ఎస్.రాజీవ్‌కృష్ణ, పార్టీ సీఈసీ సభ్యులు ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, తణుకు అసెంబ్లీ  నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాధయ్య, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, రాష్ట్ర రైతు కార్యదర్శి చెలికాని రాజబాబు, సుంకర చిన్ని పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు