పాపం పసివాడు

1 Jun, 2019 13:20 IST|Sakshi
జ్ఞానదీప్‌ తల్లిదండ్రులు లివర్‌ వ్యాధి కారణంగా కోమాలోకి వెళ్లిన నాలుగేళ్ల దార్ల జ్ఞానదీప్‌

పశ్చిమగోదావరి, కొయ్యలగూడెం: చిట్టిపొట్టి మాటలతో తడబడుతూ, నడుస్తూ తల్లిదండ్రులను ఆనందింపచేస్తున్న ఆ బాలుడికి అనుకోని కష్టం వచ్చింది. దీంతో బాలుడు కోమాలోకి వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. కొయ్యలగూడెం గ్రామానికి చెందిన కార్పెంటర్‌ వృత్తి చేస్తున్న దార్ల సత్యనారాయణకు నాలుగు సంవత్సరాల జ్ఞానదీప్, కుమార్తె ఉన్నారు.  జ్ఞానదీప్‌కు కొద్దిరోజుల క్రితం జ్వరం రావడంతో ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించి చికిత్సను అందించారు.

అక్కడ మెరుగుపడకపోవడంతో జంగారెడ్డిగూడెం, అక్కడ నుంచి విజయవాడకు తీసుకువెళ్లారు. అయితే జ్ఞానదీప్‌కు లివర్‌ సంబంధిత వ్యాధి సంక్రమించిందని, తద్వారా కిడ్నీలు, బ్రెయిన్‌ మొద్దుబారి కోమాలోకి జారుకున్నట్లు వైద్యులు తెలిపారన్నారు. జ్ఞానదీప్‌ మెరుగుపడటానికి రూ.5 లక్షల వరకు ఖర్చవుతుందని తెలపడంతో ఇప్పటికే చికిత్స నిమిత్తం సత్యనారాయణ ఉన్నవన్నీ అమ్ముకుని కొడుకును కాపాడుకునేందుకు ప్రయత్నించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో బాలుడిని ఆదుకోవాలంటే రోజుకు భారీగా ఖర్చవుతుందని వైద్యులు పేర్కొన్నారని, కట్టుబట్టలతో మిగిలిన తమకు బాలుడు వైద్యచికిత్సను అందించడం కష్టంగామారిందని తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున గానీ, దాతల తరఫున గానీ తమకు ఆర్థిక సహాయం అందించాలని దాతలు 9701705312 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు