చిన్న గుండెకు ఎంత కష్టమో..

2 Jan, 2020 12:15 IST|Sakshi
చిన్నారి దేవీశ్రీప్రసాద్‌తో తల్లిదండ్రులు

గొల్లప్రోలుకు చెందిన మూడేళ్ల బాబుకు గుండె జబ్బు

పుట్టుకతోనే ఇబ్బందులు ప్రారంభం

జనవరిలో ఆపరేషన్‌ చేయకపోతే ప్రాణానికి ముప్పన్న వైద్యులు

గొల్లప్రోలు: మూడేళ్ల చిన్నారి గుండెకు గాయమైంది. పుట్టుకతోనే గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారికి ఆపరేషన్‌ చేయకపోతే ప్రాణానికి ముప్పు అని వైద్యులు నిర్ధారించారు. గొల్లప్రోలులోని ఈబీసీ కాలనీకి చెందిన ఉమ్మిడి చంద్రశేఖర్, నీరజల మూడేళ్ల కుమారుడు దేవీశ్రీప్రసాద్‌ రెండో సంతానం. 2016లో పుట్టిన చిన్నారికి గుండె కొట్టుకును శబ్ధంలో తేడాను గమనించిన వైద్యులు స్కానింగ్‌ చేయించడం ద్వారా ఏరోటిక్‌ వాల్వ్‌ మూసుకుపోయి బ్లాక్‌ అవ్వడం ద్వారా రక్తసరఫరా మూసుకుపోయినట్టు గుర్తించారు. హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో రూ.రెండులక్షలు వెచ్చించి గుండె వైద్యపరీక్షలు నిర్వహించి ప్రమాదకరమైన గుండె వ్యాధిగా నిర్ధారించారు.

అప్పటి నుంచి క్రమం తప్పకుండా వైద్యులు సూచన మేరకు మందులు వాడుతున్నారు. ఇటీవల బెంగుళూరులోని ఆర్‌ఎక్స్‌ డీఎక్స్‌ ఆసుపత్రి, కొలంబియా ఆసియా ఆసుపత్రి వైద్యులు పరిక్షలు నిర్వహించగా వాల్వ్‌ లీకేజీ ఎక్కువగా ఉండడంతో పాటు ఎడమ వైపు గుండె పరిమాణం పెద్దదిగా ఉన్నట్టు గుర్తించారు. గుండె పంపింగ్‌ కూడా బాగా తగ్గినట్టు గుర్తించారు. జనవరిలో ఓపెన్‌ హార్ట్‌ ఆపరేషన్‌ నిర్వహించకపోతే ప్రాణానికి ప్రమాదం అని కొలంబియా ఆసియా వైద్యులు తెలిపారు. కొన్ని గంటలపాటు నిరంతరాయంగా నిర్వహించే ఆర్‌ఓఎస్‌ఎస్‌ ఆపరేషన్‌కు సుమారు రూ.ఎనిమిది లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. పురుగు మందులు షాపులో గుమస్తాగా పని చేస్తూ నెలకు రూ.10వేలు సంపాదించుకునే చిన్నారి తండ్రి చంద్రశేఖర్‌ ఆపరేషన్‌కు అయ్యే ఖర్చు తట్టుకునే ఆర్థిక స్థోమత లేక తల్లడిల్లిపోతున్నాడు. గుండె చికిత్స కోసం ప్రభుత్వం, దాతలు సహాయం చేయాలని చంద్రశేఖర్‌ కోరుతున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

న్యూఇయర్‌కు వినూత్న స్వాగతం

బందరు ఫిషింగ్‌ హార్బర్‌కు మహర్దశ! 

పవన్‌ గబ్బర్‌సింగ్‌ కాదు రబ్బర్‌సింగ్‌

నాకు నాన్న అవసరం లేదు...

పల్లెలకు అందని సాంకేతిక విప్లవం 

టీడీపీ నాయకుడి కుమారుడి అఘాయిత్యం

కడుపులో బిడ్డకూ కూలి

హాయ్‌.. ఇది చాలా ఫాస్ట్‌ గురూ..! 

నిజాలు నిగ్గు తేల్చేందుకు ఎన్‌ఐఏ!

నేటి ముఖ్యాంశాలు..

వణికిస్తున్న చలి గాలులు

రబీ పంటల బీమాపై పల్లెల్లో ప్రచారం

లైంగికదాడి బాధితులకు సత్వర వైద్యం

వలస  కుటుంబాలకు ఊరట 

అమరావతి నుంచి రాజధాని మార్చనివ్వం

ఇవ్వాల్సింది గాజులు కాదు.. కొట్టేసిన భూములు 

భూముల సమగ్ర రీసర్వేకు శ్రీకారం 

‘ఎస్క్రో’ నుంచి ఎస్కేప్‌.. అడ్డదారిలో బిల్లులు

తగ్గిన మందు.. చిందు!

ఉద్యోగ విద్య

ఆర్టీసీ డిపోల్లో భారీగా సంబరాలు

అన్నదాతలకు సంక్రాంతి కానుక

గవర్నర్‌కు సీఎం జగన్‌ న్యూఇయర్‌ విషెస్‌

'కబ్జాలకు కేరాఫ్‌ అడ్రస్‌ ఆయనే'

ఈనాటి ముఖ్యాంశాలు

‘థాంక్యూ సీఎం’.. ఈ విలీనం చరిత్రాత్మకం

తిరుమలలో సామాన్య భక్తులకే పెద్దపీట

‘స్క్రిప్ట్‌ చదివి ఆయన హైదరాబాద్‌ వెళ్లిపోతాడు’

2020 కూడా రైతు నామ సంవత్సరమే: నాగిరెడ్డి

ఆశల జనవరి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పాండ్యా, నటాషా నిశ్చితార్థం.. మాజీ ప్రియుడి స్పందన

ఆర్‌ఆర్‌ఆర్‌ హీరోయిన్‌ ట్వీట్‌ వైరల్‌

షారుక్‌.. కమల్‌.. 4 నిమిషాల్లో 51మంది

పవన్‌,ఆద్య ఫొటో షేర్‌ చేసిన రేణూ

కారు ధ్వంసం చేశారని శ్రీరెడ్డి ఫిర్యాదు

ప్రతిరోజూ పండగే అందరి విజయం