సాయం అందేలోపే..మృత్యువు మింగేసింది!

3 Jan, 2020 13:09 IST|Sakshi

ప్రకాశం, ఉలవపాడు: కరేడు పంచాయతీ పరిధి కొత్తపాలెం గ్రామానికి చెందిన కొక్కిలగడ్డ రాస్య (2) తీవ్ర గాయాలతో వైద్యశాలలో చికిత్స పొందుతూ గురువారం చెన్నైలో మృతి చెందింది. రాస్య సాంబార్‌లో పడటంతో తీవ్రంగా గాయపడింది. చెన్నైలోని వైద్యశాలలో చికిత్స పొందుతోంది. డబ్బులు లేని కారణంగా ఆ బాలికను ఆదుకునే వారు కావాలని గురువారం ‘సాక్షి’లో ఓ కథనం కూడా ప్రచురితమైంది. దాతల నుంచి సాయం అందేలోపు ఆ చిన్నారి మృత్యుఒడికి చేరుకుంది. ఇప్పటికే నాలుగు లక్షల రూపాయలకుపైన తల్లిదండ్రులు ఖర్చు పెట్టినా చిన్నారి దక్కలేదు. రాస్య పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఊటుకూరులో తన అమ్మమ్మ వద్ద ఉన్నప్పుడు వేడి వేడి సాంబార్‌లో పడిపోయింది. సాంబార్‌ ఆ చిన్నారి పాలిట విలన్‌గా మారి ప్రాణాలు తీసింది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు