కాలుష్యం ప్రపంచానికి పెనుసవాలు

19 Feb, 2014 04:10 IST|Sakshi
కాలుష్యం ప్రపంచానికి పెనుసవాలు

కాలుష్యం ప్రపంచానికి పెనుసవాలు
 కొవ్వూరుపాడు(గోపాలపురం),  :పర్యావరణ కాలుష్యం ప్రపంచానికి పెను సవాలుగా మారిందని, ప ర్యావరణం సమతుల్యం కోల్పోవటం తో అనేక సమస్యలు
 
 ఉత్పన్నమవుతున్నాయని కొవ్వూరుపాడులోని జెడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం ఎన్వీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.
 
 ఈ పాఠశాలలో మంగళవారం నీడ స్వచ్ఛంద సంస్థ ఆ ధ్వర్యంలో జాతీయ పర్యావరణ జాగృ తి కార్యక్రమంపై అవగాహన కార్యక్ర మం నిర్వహించారు. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పర్యావరణ సమతుల్య త లోపించి ప్రకృతి వైపరీత్యాలు అనూహ్యంగా పెరిగిపోవటంతో ప్రపంచం లో అనేక వృక్ష, జంతు, పక్షి జాతులు కనుమరుగుఅవుతున్నాయని వివరిచారు. నీడ డెరైక్టర్ చాపల బాబూరావు మాట్లాడుతూ మానవుని దుశ్చర్యవల్ల అడవులు క్షీణించి పోతున్నాయని, దీంతో మొక్కలను పెంచాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. ఉపాధ్యాయులు ఎస్‌కే ఫరూఖ్‌అహ్మద్, ఎస్. వీరభద్రరావు, కె.రాముడు, ఎం.వెంకట్రామయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు