బాలయ్య.... ఇక తాతయ్య!

10 Sep, 2014 10:17 IST|Sakshi
బాలయ్య.... ఇక తాతయ్య!

ప్రముఖ హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ త్వరలో తాతయ్య కాబోతున్నారు. ఆయన పెద్ద కుమార్తె, నారా వారి కోడలు బ్రహ్మణి ... త్వరలో తల్లి కాబోతోంది. టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్, బ్రహ్మణిల వివాహం 2007లో జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు వాళ్లు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ శుభవార్తను లోకేష్... 'ఎస్ ఇట్స్ ట్రూ అండ్ థాంక్యూ ఫర్ ది విషెస్' అంటూ.... ఓ ఆంగ్ల దినపత్రికకు ధ్రువీకరించారు.

ఇక ఇటు నందమూరి, అటు నారావారి కుటుంబంలోకి బుజ్జి పాపాయి రాబోతుండటంతో ఇరు కుటుంబాలు సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణకు ఇది డబుల్ బొనాంజా అవుతుంది. చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో పాటు, బాలయ్య సతీమణి వసుంధర దేవి కూడా తొలిసారి నానమ్మ, అమ్మమ్మ హోదాపై చాలా థ్రిల్లింగ్గా ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.

ఇరు కుటుంబాలకు సన్నిహితులు, స్నేహితుల నుంచి శుభాకాంక్షలు  వెల్లువెత్తుతున్నాయి. బ్రహ్మణి ఆరోగ్యంగా ఉన్నారని, బిడ్డ పెరుగుదల కూడా బాగున్నట్లు వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆ బుజ్జి పాపాయి కోసం వచ్చే ఏడాది వేసవి వరకూ ఆగాల్సిందేనట. కాగా ఈ విషయంపై బావ చంద్రబాబు, బావమరిది బాలయ్యలు ముసి ముసి నవ్వులే తప్ప, పెదవి మాత్రం విప్పటం లేదు.

(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు