నేడు మంత్రి బాలినేని పర్యటన ఇలా

2 Sep, 2019 08:18 IST|Sakshi

సాక్షి, ఒంగోలు సిటీ: రాష్ట్ర విద్యుత్తు, అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సోమవారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆయన ఆదివారం రాత్రికి ఒంగోలుకు చేరుకొని వీఐపీ రోడ్డులోని ఆయన నివాస గృహంలో బస చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు స్థానిక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయంలో నగర అధ్యక్షుడు శింగరాజు వెంకట్రావు అధ్యక్షతన నిర్వహించే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు.

► ఉదయం 10.15 గంటలకు వీఐపీ రోడ్డు పాత సుజాత నగర్‌ వద్ద బాబూరావు అధ్యక్షతన జరిగే వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు.
 10.30 గంటలకు వీఐపీ రోడ్డులోని విశ్వసేవిక ఆశ్రమంలో మహిళా విభాగం అధ్యక్షురాలు గంగాడ సుజాత అధ్యక్షతన జరిగే వృద్ధులకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.
► 10.45 గంటలకు ప్రభుత్వ బీసీ వసతి గృహంలో జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు కటారి శంకర్‌ అధ్యక్షతన విద్యార్థులకు ట్రంకు పెట్టెలు, ఇతర వస్తువుల పంపిణీలో పాల్గొంటారు.
► 11 గంటలకు గాంధీరోడ్డులో పట్నం మధు, ఎస్‌.కె.మీరావలి అధ్యక్షతన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి  వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు.
► 11.15 గంటలకు మాతాశిశు వైద్యశాలలో బాలింతలకు నగర అధ్యక్షులు శింగరాజు వెంకట్రావు అధ్యక్షతన పండ్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.
► 11.30 గంటలకు చర్చి సెంటర్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించే కార్యక్రమంలో పాల్గొంటారు.
► 11.45 గంటలకు గోరంట్ల కాంప్లెక్సు వద్ద జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షులు సయ్యద్‌ జలీల్‌ అధ్యక్షతన రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు. 
► 11.55 గంటలకు బలరాం కాలనీలో డివిజన్‌ అధ్యక్షుడు షేక్‌ జాఫర్‌ అధ్యక్షతన పేదలకు చీరల పంపిణీ, వృద్ధులకు పండ్ల పంపిణీలో పాల్గొంటారు. 
► మధ్యాహ్నం 12.10 గంటలకు ఆర్టీసీ బస్టాండ్‌లో 49వ డివిజన్‌ నాయకులు గురవయ్య, కాశయ్య అధ్యక్షతన వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు.
► 12.20 గంటలకు కూచిపూడి బజారులో 45వ డివిజన్‌ నాయకులు రవి అధ్యక్షతన దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు.
► 12.30 గంటలకు ఉమా మనోవికాసకేంద్రంలో డివిజన్‌ నాయకులు రవి అధ్యక్షతన రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు. 
► 12.45 గంటలకు గాంధీనగర్‌లో స్ధానిక నాయకులు పెద్దిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించే కార్యక్రమం, పలహారం పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.
► రాత్రి 7.30 గంటలకు మాజీ కౌన్సిలర్‌ ఈదర చిన్నారి అధ్యక్షతన హౌసింగ్‌ బోర్డులో వినాయక విగ్రహ సందర్శన కార్యక్రమంలో పాల్గొంటారు.
► 8 గంటలకు గాంధీరోడ్డులో సూపర్‌బజార్‌ మాజీ అధ్యక్షుడు తాతా ప్రసాద్‌ అధ్యక్షతన వినాయక విగ్రహం సందర్శన కార్యక్రమంలో పాల్గొంటారు.
► 8.15 గంటలకు రంగుతోటలో వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్‌ అధ్యక్షతన వినాయక విగ్రహం సందర్శన కార్యక్రమాల్లో  పాల్గొంటారు. 

మరిన్ని వార్తలు