​కరోనాపై సమీక్ష: వలంటీర్ల వ్యవస్థ కీలకం

21 Mar, 2020 16:51 IST|Sakshi

సాక్షి, ఒంగోలు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రజల్లో కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) గురించి పూర్తి అవగాహన కల్పిస్తున్నామని విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆయన ఒంగోలులో శనివారం నిర్వహించిన కరోనా నివారణ సమీక్షలో పాల్గొన్నారు. ఆయనతో పాటు ఈ సమీక్షలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ.. జిల్లాలో కరోనాపై పూర్తి అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. అధికార యంత్రాంగం చాలా కష్టపడుతోందన్నారు. (కరోనా వైరస్‌: ప్రతి ఇంటిని సర్వే చేస్తున్నాం)

ఒకప్పుడు గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడారని ఆయన మండిపడ్డారు. ఇప్పడు అదే వ్యవస్థ కీలకంగా మారిందని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందు చూపుతోనే వాలంటీర్లు వ్యవస్థ ఏర్పాటైందన్నారు. ఇలాంటి సమయంలో మీడియా బాధ్యతగా మెలగాలని మంత్రి సూచిం​చారు. వైరస్‌పై తప్పుడు, అసత్య ప్రచారం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని బాలినేని పేర్కొన్నారు. (‘వారి నమూనాలను ల్యాబ్‌కు పంపించాం’)

అదేవిధంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. స్కూళ్లు, కాలేజీలపై పూర్తి నిఘా పెట్టామని తెలిపారు. నిబంధనలు అతిక్రమించి స్కూళ్లు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యాసంస్థలపై తనిఖీలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. ఈ ఆపదకాలంలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ఉపయోగిస్తున్నామని సురేష్‌ చెప్పారు. (కరోనా: జనతా కర్ఫ్యూ.. ఏపీలో బస్సులు బంద్‌!)

మరిన్ని వార్తలు