పీపీఏల్లో టీడీపీ భారీ అక్రమాలు

25 Oct, 2019 04:26 IST|Sakshi

మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

విద్యుత్తు రంగాన్ని రూ.30 వేల కోట్ల అప్పుల్లో ముంచారు

బీజేపీ పాలిత యూపీలోనే పీపీఏలను రద్దు చేశారు

వ్యవసాయానికి 9 గంటలు కరెంట్‌

ఒంగోలు సిటీ: విద్యుత్‌ రంగంలో ప్రైవేట్‌ సంస్థల నుంచి విద్యుత్‌ కొనుగోలు చేసే పవర్‌ పర్చేజీ అగ్రిమెంట్ల(పీపీఏ)లో టీడీపీ భారీగా అక్రమాలకు పాల్పడిందని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. గురువారం ఒంగోలులో విలేకరులతో మాట్లాడారు. పీపీఏలు పవన, సౌర విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్న సంస్థలతో చేసుకున్న ఒప్పందాల వల్ల విద్యుత్‌ రంగాన్ని రూ.30 వేల కోట్ల అప్పుల ఊబిలో దించారని విమర్శించారు. కొన్ని ప్రైవేట్‌ కంపెనీలు యూనిట్‌ రూ.2.50కే ఇవ్వడానికి ముందుకొచి్చనా.. టీడీపీ ప్రభుత్వం యూనిట్‌ రూ.4.85 ధరకి ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతోనే ఏ మేరకు అక్రమాలు జరిగాయో వెల్లడవుతుందన్నారు.పీపీఏల విషయంలో న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వ వాదనతో సానుకూల ధోరణితో ఉందని ప్రస్తావించారు.

బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లోనే విద్యుత్‌ పీపీఏలను రద్దు చేశారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్‌ పరంగా కొన్ని  ఇబ్బందులున్న మాట వాస్తవమేనని బాలినేని అన్నారు. 20 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. వ్యవసాయానికి ఉచితంగా నిరాటంకంగా తొమ్మిది గంటల విద్యుత్‌ ఇస్తున్నామని అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.1,500 కోట్లు కేటాయించామని తెలిపారు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు మొదలెట్టడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.  గరిష్ట సమయాల్లో పవన, సౌర విద్యుత్‌ ఉత్పత్తి బాగా పడిపోతుందని, థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి వల్ల ఇలాంటి ఇబ్బందులు తలెత్తవని వివరించారు. అన్ని రంగాలను చంద్రబాబు నాయుడు నిరీ్వర్యం చేశారని బాలినేని విమర్శించారు. వైఎస్సార్‌ సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్‌   పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

డిసెంబర్‌ నాటికి పట్టణాల్లో 70 వేల గృహాలు

గురుదేవ్‌ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెనుముప్పు

బాలయ్యా..రోడ్డు ఎక్కడయ్యా? 

పెట్రో కెమికల్‌ కారిడార్‌తో భారీ పెట్టుబడులు

ఒక్కరోజు ధర్నాకు రూ.10 కోట్లా?

చేనేతలకు కొండంత అండ

యువశక్తి సద్వినియోగంతోనే దేశాభివృద్ధి

తుది అంకానికి ఆమోదం

కనీస వసతులు లేకుండా హైకోర్టు ఏర్పాటు చేస్తారా?

ఆర్టీసీ వీలీనంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఈనాటి ముఖ్యాంశాలు

ఏపీలో అర్చక పరీక్ష ఫలితాలు విడుదల

'జిల్లా అభివృద్ధే ద్యేయంగా కృషి చేయాలి'

అదుపుతప్పిన లారీ; ఒకరి మృతి

వైఎస్‌ జగన్‌ నివాసానికి సదానందగౌడ

చంద్రబాబు దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌

భారీ వర్షాలు; అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం

సాగు సంబరం

ఆ వార్తలను ఖండిస్తున్నా: బాలినేని

సంక్షేమ పథకాలే అజెండా..

ఇంజనీరింగ్ విద్యార్థులే లక్ష్యంగా ...

అన్నదాతలకే అన్నం పెట్టే సద్దిమూట

సూరంపల్లిలో ‘సీపెట్‌’  ప్రారంభం

ఆయనే దొంగ లెక్కలు సృష్టించాడా మరి! 

కనకదుర్గమ్మకు గాజుల మహోత్సవం

బస్సులో రచ్చ, టీడీపీ నేతబంధువు వీరంగం

వణికిస్తున్న వర్షాలు

బోటు ప్రమాదంలో ఐదుగురి మృతదేహాలు గుర్తింపు

అది గత ప్రభుత్వ ఘనకార్యమే!

టీటీడీలో ‘స్విమ్స్‌’ విలీనం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

జాబిలమ్మ ముస్తాబు

సంగీతంలో సస్పెన్స్‌

రాజమండ్రికి భీష్మ

చలో కేరళ

మరో రీమేక్‌లో...

మీటూ మార్పు తెచ్చింది