పిలిస్తే పలికే వాసన్న.. ఎదురైనా పట్టించుకోని దామచర్ల

10 Apr, 2019 11:53 IST|Sakshi
బాలినేని శ్రీనివాసరెడ్డి, దామచర్ల జనార్దన్‌

సాక్షి, ఒంగోలు సిటీ: రాష్ట్ర రాజకీయాలకు ఒంగోలు కేంద్ర బిందువు. ఇక్కడి ఫలితాలు పార్టీల భవితవ్యాలను తేల్చుతాయన్నది ఒక విశ్వాసం. గతంలో జరిగిన పరిణామాలు.. వివిధ సందర్భాలు దీనిని బలపరుస్తున్నాయి. ఇంత ప్రాధాన్యం గల ఒంగోలు అసెంబ్లీ నుంచి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ అభ్యర్థిగా దామచర్ల జనార్దన్‌ పోటీలో ఉన్నారు. నాలుగు పర్యాయాలు బాలినేని ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ ఐదేళ్లే దామచర్ల శాసనసభ్యునిగా పని చేశారు. రాజకీయాల్లో సీనియర్‌గా అనుభవజ్ఞునిగా బాలినేనికి మంచి పేరుంది. గత ఎన్నికల్లో దామచర్లకు ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చినా ప్రజారంజకంగా పాలన చేయలేకపోయారన్న విమర్శలు మూటగట్టుకున్నారు.

అభ్యర్థుల గుణగణాలు

బాలినేని శ్రీనివాసరెడ్డి
సౌమ్యుడు..మితభాషి. 
చిన్నవారినైనా..ఎంతటి వారినైనా ఒకే విధంగా  గౌరవిస్తారు. 
నిత్యం చిరునవ్వు ఆయన పెదవిపైనే ఉంటుంది. కల్మషం లేని వ్యక్తి
తనకు హాని చేసిన వారినైనా పెద్దమనసుతో క్షమిస్తారు. 
ఎంత కష్టం వచ్చినా నమ్మిన వారి కోసం నిలబడే వ్యక్తిత్వం
అనారోగ్యం, కుటుంబ సమస్యలున్నాయంటే తన జేబులో ఎంత ఉన్నా ఇచ్చే దానగుణం
♦ దైవాన్ని అధికంగా నమ్ముతారు. అంతకన్నా ఎక్కువగా అభిమానులకు బాసటగా నిలుస్తారు. 
♦ వాసన్న అంటే ఇట్టే పలికే గుణం ఆయన సొంతం అభిమానుల అభిమతం ఇది.
నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం 
అవినీతి రహితుడిగా, అభివృద్ధి ప్రదాతగా ప్రజల నుంచి మన్ననలు
జిల్లాలోని సమస్యలపై సంపూర్ణ అవగాహన 

దామచర్ల జనార్దన్‌
గర్విష్టి, రాచరిక పాలన సాగిస్తారన్న విమర్శ
మనస్సులో ఒకటి పెట్టుకొని వేరొకటి మాట్లాడుతుంటారు. 
ఆయన మాటల్లో అర్థాలు నిగూఢంగా ఉంటాయి.
ఖర్చు పెట్టే ప్రతి పైసా తిరిగి వసూలు చేయడం ఆయన నైజం. 
♦ తను, తనవారన్న స్వార్థం 
దామచర్ల అందించే సహాయం రాజకీయ నాయకులు అందించే తరహాలోనే ఉంటుందన్న విమర్శలు
నియోజకవర్గం, జిల్లా ప్రజలు రైతులు ఎదుర్కొనే సమస్యలపై అవగాహన అంతంతమాత్రమే
గంటల కొద్ది సమయాన్ని వృథా చేస్తారన్న అభియోగం  
ఎవరైనా, ఎంతటి వారైనా దామచర్ల ఇంటికి వస్తే వీధి గుమ్మం వద్దే చెప్పులు విడిచి రావాలి
సామాన్యులకు అందుబాటులో ఉండరన్న విమర్శ
ఐదేళ్ల పాలనలోనే ఎన్నో అవినీతి ఆరోపణలు
సీనియర్‌ నేతలను గౌరవించరన్న అభియోగం 
తన సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యం 
తన స్వార్థం కోసం అధికారుల బలిచేస్తారన్న ప్రచారం

మరిన్ని వార్తలు