రూ.6.5 కోట్లతో ‘బనవాసి’ అభివృద్ధి

14 Nov, 2013 00:49 IST|Sakshi

మంత్రాలయం, న్యూస్‌లైన్:  ఎమ్మిగనూరు మండలంలోని బనవాసి ఫారం అభివృద్ధికి ప్రభుత్వం రూ.6.50 కోట్లు మంజూరు చేసినట్లు పశుగణాభివృద్ధి శాఖ రాష్ట్ర ముఖ్య కార్యనిర్వాహణాధికారి డాక్టర్ పీడీ కొండారావు పేర్కొన్నారు. రాఘవేంద్రుల దర్శనార్థం  బుధవార ం ఆయన మంత్రాలయం వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బనవాసిలో ఫారం అభివృద్ధి, కొత్త ఆబోతుల కొనుగోలు, ఘనీకృత వీర్యం నిల్వ పరికరాల కోసం ఈ నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. కరీం నగర్, బనవాసి క్షేత్రాల్లో 66 నుంచి 120 జెర్సీ ఆబోతులు పెంచుతామని వివరించారు.

లైవ్ స్టాకు కోసం రూ.9 కోట్లు, ఘనీకృత వీర్య కేంద్రాల అభివృద్ధికి జాతీయ డెయిరీ ప్రణాళిక నుంచి రూ.20 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. రాష్ట్రంలో గతేడాది  108 లక్షల పశువులు ఉండగా ఈ ఏడాది 93 లక్షలకు పడిపోయాన్నారు. కృత్రిమ గర్భదారణ ద్వారా 25 శాతం పశువులు వృద్ధి చెందుతున్నట్లు చెప్పారు. సెమెన్ ధన రూ.30 నుంచి 40కి పెరిగిందన్నారు. ఆయనతోపాటు పశుగణాభివృద్ధి శాఖ జిల్లా సీఈవో హమీద్‌బాషా, డాక్టర్ శ్యాంప్రసాద్, వరప్రసాద్, ఆచారి  పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు