‘బంగారు తల్లీ’..ఎక్కడున్నావ్?

18 May, 2015 01:07 IST|Sakshi

పిఠాపురం:బాలికా సంరక్షణ పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించిన ‘బంగారుతల్లి’ పథకం జిల్లాలో అమలుకు నోచుకోవడం లేదు. 2013 మే ఒకటి నుంచి ఆడపిల్ల పుడితే ‘బంగారుతల్లి’ పేరిట ఆర్థిక సహాయం అందించాలన్నది ఈ పథకం లక్ష్యం. ఆస్పత్రిలో ప్రసవం, ఇతర ఖర్చులకు రూ.2,500, తరువాత టీకాలకు రూ.వెయ్యి, అంగన్‌వాడీ చదువులకు ఏడాదికి రూ.1500, ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ ఏడాదికి రూ.2 వేలు ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించారు. అలాగే 6, 7, 8 తరగతులకు ఏడాదికి రూ.2500, తొమ్మిది, పది తరగతులకు ఏడాదికి రూ.3వేలు, ఇంటర్‌మీడియెట్‌కు ఏడాదికి రూ.3500, గ్రాడ్యుయేషన్‌కు ఏడాదికి రూ.4వేలు దశలవారీగా అందించాలని నిర్దేశించారు.
 
  అలాగే బాలికకు 18 సంవత్సరాల అనంతరం ఇంటర్‌మీడియెట్ తరువాత రూ.55 వేలు, గ్రాడ్యుయేషన్ తరువాత రూ.లక్ష కలిపి ఒక్కో లబ్ధిదారుకు రూ.1.55 లక్షల ఆర్థిక సహాయం అందే విధంగా పథకాన్ని రూపొందించారు. దీనిపై విస్తృత ప్రచారం జరగడంతో ప్రారంభంలో అధిక సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. కానీ దరఖాస్తు స్వీకరణే తప్ప ఎటువంటి నిధులూ ఇవ్వలేదు. దీంతో దరఖాస్తులు వేలల్లో పేరుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల నగారా మోగడంతో పథకం అమలుకు బ్రేక్ పడింది. ఎన్నికలు పూర్తయి నెలలు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు.
 
 ఖాతాలకు జమ కాని సొమ్ములు
 వాస్తవానికి రెండేళ్లుగా పథకం అమలు పూర్తిగా నిలిచిపోయిందనే చెప్పాలి. 2013 నవంబరు నుంచి మాత్రమే లబ్ధిదారుల ఎంపిక జరిగింది. జిల్లా గ్రామీణ ప్రాంతంలో అప్పట్లో సుమారు 10 వేల మంది దరఖాస్తు చేసుకోగా 4 వేలమందిని ఎంపిక చేశారు. వీరికోసం మొదటి విడతగా రూ.1.10 కోట్లు విడుదల చేసినట్లు అప్పట్లో అధికారులు చెప్పారు. అలాగే జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 1200 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 350 మందిని ఎంపిక చేశారు. వీరందరికీ అధికార పార్టీ నేతలతో అధికారులు అప్పట్లో బాండ్లు పంపిణీ చేయించారు. సాధారణంగా ఈ పథకం లబ్ధిదారుల పిల్లల సంరక్షణ కోసం మొదటి విడతగా ఒక్కొక్కరికి రూ.2500 చొప్పున వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయాలి. అయితే బాండ్లు పంపిణీ చేసి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకూ ఒక్కరి ఖాతాలోనూ డబ్బు జమ
 

మరిన్ని వార్తలు