సెల్‌ఫోన్‌తోనే బ్యాంకింగ్!

27 Nov, 2016 04:20 IST|Sakshi
సెల్‌ఫోన్‌తోనే బ్యాంకింగ్!

- ఏపీ పర్స్ యాప్ ద్వారా నగదు రహిత చెల్లింపులు
- కడప, రాజంపేటల్లో సీఎం చంద్రబాబు ప్రకటన  

 
 సాక్షి ప్రతినిధి, కడప: ‘‘పెద్దనోట్ల రద్దుతో ఇబ్బందులున్నారుు. 86శాతం పెద్దనోట్లు ఉంటే, 14 శాతం మాత్రమే చిన్ననోట్లు ఉన్నాయి. రద్దు నిర్ణయంతో అన్నివర్గాల ప్రజలకు తాత్కాలికంగా ఇబ్బందులు తలెత్తాయి. ఈ నిర్ణయంతో దీర్ఘకాలంలో పేదవారికి లాభం. అవినీతిపరులకే నష్టం. టెక్నాలజీని ఉపయోగించుకుని సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు ద్వారా బ్యాంకింగ్ సేవలు విసృ్తతపర్చుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆయన శనివారం వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా రాజంపేట, కడపలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూ.100 నోట్లు వెంటనే రావు.. దిగులుపడి ఇంట్లో కూర్చుంటే నష్టపోతామని, ప్రతి ఒక్కరు సెల్‌ఫోన్, కంప్యూటర్ ద్వారా బ్యాంక్ అకౌంట్లు వినియోగించుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. నగదు రహిత చెల్లింపులు చేసుకోవచ్చునని, అకౌంట్లు నుంచి డబ్బులు బదిలీ చేయవచ్చునని వివరించారు. థియేటర్లు, ఆర్టీసీ, వ్యాపార సముదాయాలు, అవకాశం ఉన్న ప్రతిచోట స్వైపింగ్ యంత్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఉపాధిహామీ కూలీలకు సైతం వారి అకౌంట్లల్లో కూలి మొత్తం జమ చేయనున్నామని, ప్రతిఒక్కరు స్వైపింగ్ యంత్రాల ద్వారా లావాదేవీలు నిర్వహించాలని సూచించారు.

 బలవంతుడికే టీడీపీలో స్థానం  
 ‘‘నా చుట్టూ చాలామంది నాయకులు ఉన్నారు. ఏం లాభం లేదు. ఓట్లు కలిగిన బలవంతుడికే పార్టీలో స్థానం ఉంటుంది, వారికే నా మద్దతు లభిస్తుంది’’ అని సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. ఆయన శనివారం మధ్యాహ్నం వైఎస్సార్ జిల్లా కడపలోని మేడా కన్వెన్షన్ హాలులో టీడీపీ జిల్లా విసృ్తత స్థారుు సమావేశంలో సీఎం మాట్లాడారు.

మరిన్ని వార్తలు