నకిలీ బంగారంతో బ్యాంకుకు బురిడీ...

22 Mar, 2017 11:50 IST|Sakshi
నకిలీ బంగారంతో బ్యాంకుకు బురిడీ...
శ్రీకాకుళం: రాజాంలోని శ్రీకాకుళం రోడ్డులో  కరూర్‌వైశ్యాబ్యాంకులో అప్రజైర్‌ (బంగారు ఆభరణాల పరిశీలకుడు) గా విధులు నిర్వహిస్తున్న ఘరానామోసగాడు బ్యాంకుకే కన్నం పెట్టాడు. నకిలీ బంగారు ఆభరణాలను ఒరిజినల్‌ బంగారు ఆభరణాలుగా ధ్రువీకరించి రూ. 1,33,55,000 లను కొల్లగొట్టాడు. 40మంది ఖాతాదారులతో ఈ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. చివరికి అనూహ్యంగా పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే.... రాజాంలోని కరూర్‌ వైశ్యాబ్యాంకులో గత ఏడాదిన్నర నుంచి బంగారు ఆభరణాలపై రుణాలు ముమ్మరంగా అందించారు. 
 
ఇటీవల బ్రాంచి మేనేజర్‌ చంద్రమౌళిరెడ్డి బంగారు ఆభరణాలపై రుణాలు పొంది గడువు ముగిసిన లబ్దిదారులకు నోటీసులు పంపించాడు. ఎటువంటి స్పందన రాకపోవడంతో బ్రాంచి మేనేజర్‌ ఆరా తీయడం ప్రారంభించారు. మరోవైపు ఈ ఆభరణాలు వేలం వేసేందుకు గడువు రావడంతో బ్యాంకుకు చెందిన ఉన్నతాధికారులు రెండు రోజులు క్రితం బ్యాంకుకు చేరుకొని వేలంవేసే ఆభరణాలపై ఆరా తీశారు. వాటిని పరిశీలించగా నకిలీ ఆభరణాలుగా గుర్తించడంతో మొత్తం ఆభరణాలపై ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయపడింది.
 
సమాచారం తెలుసుకున్న సీఐ శంకరరావు బ్యాంకుకు చేరుకొని ఆరా తీశారు. మేనేజర్‌ వద్ద ఫిర్యాదులు సేకరించిన అనంతరం అప్రైజర్‌ను విచారించారు. అప్రైజర్‌ను పోలీసు స్టేషన్‌కు తరలించారు. బ్యాంకు మేనేజర్‌ ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ రుణాలకు సంబంధించి అప్రైజర్‌ పాత్రతోపాటు బ్యాంకు మేనేజర్‌ ఇచ్చిన వివరాలు ప్రకారం ఖాతాదారులను వివరించనున్నట్లు తెలిపారు. 
Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనా వైరస్‌: ఇంకా ఎవరైనా ఉన్నారా? 

నేటి ముఖ్యాంశాలు..

సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళాల వెల్లువ

అందరికీ రేషన్‌ అందిస్తాం 

కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తే పెండింగ్‌ బిల్లులు చెల్లించం

సినిమా

ఇటలీలో మన గాయని

స్ఫూర్తి నింపేలా...

మిస్‌ యు

హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌ 

ఆ వార్తలు నిజం కాదు

ప్రజల కోసం చేసిన పాట ఇది