ముందుకొచ్చిన సముద్రం!

13 Aug, 2018 14:46 IST|Sakshi
నిర్మానుష్యంగా సముద్ర తీరం

బాపట్ల : సముద్రం ముందుకొచ్చిందంటూ ప్రచారం జోరుగా సాగింది. దీంతో పోలీస్, రెవెన్యూ యంత్రాంగం ఆదివారం అప్రమత్తమైంది. తహసీల్దార్‌ టి.వల్లయ్య, డీఎస్పీ గంగాధరంతోపాటు యంత్రాంగం సూర్యలంక సముద్రతీరానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సముద్రం ముందుకు రావడం కాదని, వర్షాల కారణంగా అలలు ఉధృతంగా వస్తున్నాయని అధికారులు తెలిపారు. అందుకే సముద్ర స్నానాలకు అనుమతించలేదని పేర్కొన్నారు. ఒడ్డున ఉండి మాత్రమే సముద్రాన్ని చూడాలని విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులు కూడా వేటకు వెళ్లవద్దంటూ సూచించారు. రూరల్‌ సీఐ చిట్టెం కోటేశ్వరరావు, ఎస్‌ఐ గళ్ల రవికృష్ణ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు