‘ఎంపీ టికెట్‌ ఇస్తారని ఊహించలేదు’

17 Mar, 2019 13:15 IST|Sakshi

సాక్షి, బాపట్ల:  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల ప్రకటనపై ఏపీ ప్రజానీకం సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్ల చంద్రబాబు నాయుడు పాలనలో అధికారానికి దూరమైన బీసీ, ఎస్సీ కులాల వారికి వైఎస్సార్‌సీపీ అండగా నిలిచింది. లోక్‌సభ, అసెంబ్లీ జాబితాలో వారికి పెద్దపీఠ వేసింది. ఈ నేపథ్యంలో తనకు సీటు ఎంపీ సీటు ఇవ్వడమంటే సామాన్య ప్రజలకు, పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలవడమేనని బాపట్ల వైఎస్సార్‌సీపీ లోక్‌సభ అభ్యర్థి నందిగం సురేష్‌ అభిప్రాయపడ్డారు. ఆర్థిక వెనుకబడిన వర్గానికి చెందిన తనకు సీటు వస్తుందని అస్సలు ఊహించలేదని, వైఎస్‌ జగన్‌ ఆశీస్సులతో ఎంపీగా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.


వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రకటన..

వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థిగా తనను ప్రకటించగానే తన బంధవులు, స్నేహితులంతా ఆశ్చర్యానికి గురైయ్యారని, ఎన్నికల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చపెట్టలేని తనకు బాపట్ల లోక్‌సభ సీటు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఎస్సీ కులానికి చెందిన తనతోనే ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయించారని, జగన్‌ సీఎం అయితే ఎస్సీ,బీసీలకు అండగా నిలుస్తారని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు పాలనకు చరమ గీతంపాడి.. ఏపీలో నవ నాయకత్వానికి నాంది పలకడానికి ఏపీ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. 
 

మరిన్ని వార్తలు