గోదావరి తీరంలో బాపు-రమణల విగ్రహాలు

1 Sep, 2014 11:33 IST|Sakshi
గోదావరి తీరంలో బాపు-రమణల విగ్రహాలు

హైదరాబాద్ : శాసనసభ్యుల సూచన మేరకు గోదావరి తీరంలో బాపు, ముళ్లపూడి రమణల విగ్రహాలను పక్కపక్కనే ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కార్టూనిస్టుగా, చిత్రకారుడిగా, చిత్ర దర్శకుడిగా చెరగని ముద్రవేసిన బాపూకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సోమవారం ఘనంగా నివాళులు అర్పించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సభలో బాపూ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.   బాపు మృతి తెలుగు సినిమాకు తీరని లోటు అని చంద్రబాబు అన్నారు.  తెలుగు అమ్మాయి అంటే ఇలా ఉండాలి అని చూపించిన ఘటన బాపూదన్నారు. తెలుగుతో పాటు 51 సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారని చంద్రబాబు అన్నారు.  చిత్రసీమలో బాపూది ఓ ప్రత్యేక స్థానం అని ఆయన కొనియాడారు.

ఇక బాపు అద్భుతమైన దర్శకుడని, ఆయన నుంచి తనకు ఒకసారి పిలుపు వచ్చిందని.. వెంటనే తాను పరుగున వెళ్లి వెంటనే అంగీకరించానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్ కే రోజా తెలిపారు. ఆయన తన పాత్రను చాలా అద్భుతంగా తీర్చి దిద్దారని, అలాంటి మహనీయుడు ఇప్పుడు లేరంటే మాట్లడటానికి గొంతు కూడా రావట్లేదని ఆమె అన్నారు.

మరిన్ని వార్తలు