జంతువులతో జాగ్రత్త సుమా...

5 Jul, 2015 01:42 IST|Sakshi

 జంతువుల నుంచి మనుషులకు సుమారు 280 రకాల వ్యాధులు సంక్రమిస్తున్నాయి. ఇందులో ఇందులో ప్రధానంగా రేబిస్, బ్రూసెల్లోసిస్, ఆంత్రాక్స్, స్వైన్‌ప్లూ, టీబీ, బర్డ్‌ప్లూ ప్రమాదకరమైనవి.
 
 రేబిస్ వ్యాధి:
 రాబిస్ వ్యాధి కుక్క కాటు ద్వారా మనుషులకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధి కుక్కల లాలాజలంలో ఉండే రాబిస్ అనే వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీని కోసం ప్రతీ సంవత్సరం వ్యాధి నిరోధక టీకాలు పెంపుడు జంతువులకు తప్పని సరిగా ఇప్పించినట్లైయితే మనుషులకు ఈ వ్యాధులు సోకకుండా ఉంటాయి.
 
 ఆంత్రాక్స్:
 ఈ వ్యాధి ఆంత్రాక్స్ బ్రూసెల్లోసిస్ అనే సూక్ష్మక్రిమి వల్ల వ స్తుంది. ఇది ఎక్కువగా గొర్రెలకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ఉన్న గొర్రెపొటేళ్ళ మాంసం తిన్న మనుషులకు వస్తుంది.
 
 బర్డ్‌ప్లూ:
 ఈ వ్యాధి అవయిన్‌లూప్లెంజా అనే సూక్ష్మక్రిమివల్ల వస్తుంది. ఇది గాలి ద్వారా చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి వచ్చేటప్పుడు కోళ్ళుచాలా ఎక్కువగా చనిపోతాయి. ఈ వ్యాధితో ఉన్న కోళ్ళ మాంసం, రెట్టల ద్వారా మనుషులకూ వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ఎక్కువగా చలి కాలంలో వస్తుంది.
 
 టీబీ...
 దీనిని ట్యూబోలలోసిస్ అంటారు. ఇది బ్యాక్టిరీయా ద్వారా మనుషులకు, పశువులకు వచ్చి ప్రతీ సంవత్సరం అనే మంది చనిపోతున్నారు. టీబీతో ఉన్న పశువుల పాలు బాగా మరిగించకుండా తాగినట్లైయితే మనుషులకు, చిన్న పిల్లలకు ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
 

>
మరిన్ని వార్తలు