ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి : సునీల్‌శర్మ

23 Oct, 2013 03:54 IST|Sakshi

కలెక్టరేట్, న్యూస్‌లైన్ : 2013-14 ఖరీఫ్ సీజన్‌లో పండించిన వరి ధాన్యం కొనుగోలుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ సునీల్‌శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన హైదరాబాద్ నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జీవో 31 మార్గదర్శకాల ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులు నష్టపోకుండా చూడాలని అన్నారు. ఐకేపీ, పీఏసీఎస్, ఐటీడీఏ ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని చెప్పారు.
 
2012-13 సంవత్సరానికి సంబంధించి మిల్లర్ల వద్ద ఉన్న బియ్యాన్ని కస్టమ్స్ మిల్లర్ రైస్(సీఎంఆర్)ను ఎఫ్‌సీఐకి అప్పగించాలని సూచించారు. మిల్లర్ల వద్ద గతేడాదికి సంబంధించిన 17,446 మెట్రిక్ టన్నుల బియ్యం ఉన్నాయని, డిసెంబ ర్ చివరిలోగా పూర్తిగా డెలివరీ చేయాలని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ సుజాతశర్మ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలుకు కేంద్రాలను సిద్ధం చేశామని, ఈ ఏడాది లక్ష ఎంటీల ధాన్యం కొనుగోలు చేయనున్నామని వివరించారు. డీఆర్డీఏ 94, పీఏసీఎస్‌లు 18, ఐటీడీఏ 30 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేపడుతామని, 75 వేల ఎంటీల ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేస్తారని తెలి పారు. ఐకేపీ సంఘాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికి మూడు రోజుల్లో రైతులకు డబ్బులు అందించేలా చ ర్యలు తీసుకోవాలని, ఐకేపీ ఆర్టీజీఎస్ ద్వారా డబ్బులను డ్రా చేసి ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా రైతులకు అందించాలని డీఆర్డీఏ అధికారులను జేసీ ఆదేశించారు. డీఎస్‌వో వసంత్‌రావు దేశ్‌పాండే, అధికారులు పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు