రసం పీల్చే పురుగులతో అప్రమత్తంగా ఉండండి

11 Sep, 2014 01:25 IST|Sakshi
రసం పీల్చే పురుగులతో అప్రమత్తంగా ఉండండి

పెనుమూరు: బొప్పాయి, బెండ, టమాట పంట లకు రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశిస్తున్నాయని, వీటిని నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తిరుపతి రాష్ట్రీయ కృషి విజ్ఞాన కేంద్రం పట్టు పరిశ్రమ శాఖ శాస్త్రవేత్త పద్మజ తెలిపారు. బుధవారం పెనుమూరు మండలంలోని సోమనందాపురం, కావూరివారిపల్లె తదితర గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. పద్మజ మాట్లాడుతూ రసం పీల్చే పురుగుల నివారణకు ఇమిడాక్లోపిడ్ 0.5 మిల్లీలు లీటరు నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలని చెప్పారు.

బొప్పాయి తోటల్లో పిండినల్లి ఆశిస్తోంద ని, రోగార్ 2 మిల్లీలు ఒక లీటరు నీటితో కలిపి పిచికారీ చేయాలని సూచించారు. పంట సాగుకు ముందే విత్తనశుద్ధి చేపడితే తెగుళ్ల ఉద్ధృతిని అరికట్టవచ్చని వివరించా రు. రాష్ట్రీయ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యానవన శాస్త్రవేత్త సుధాకర్ మాట్లాడుతూ మండలంలో సాగవుతున్న మల్బరీ తోట ల ద్వారా పట్టు పురుగుల పెంపకంతో రైతులు మంచి లాభాలు పొందుతున్నారని, ఎకరా పొలంలో మల్బరీ తోట సాగుకు సుమారు రూ.15 వేలు ఖర్చు అవుతుందని చెప్పారు. ప్రభుత్వం పట్టు పరిశ్రమ శాఖ ద్వారా మల్బరీ సాగు చేసిన రైతులను ప్రోత్సహించడానికి ఎకరాకు రూ.6,700 నగదు సబ్సిడీని చెక్కు రూపంలో అందిస్తోందని తెలిపా రు.

తోట సాగుకు వేపపిండిని 50 శాతం సబ్సిడీతో పంపిణీ చేస్తోం దన్నారు. ఎకరా పొలంలో మల్బరీ తోట సాగు చేస్తే సుమారు 250 పట్టు గుడ్లును పెంచుకోవచ్చని చెప్పారు. రెండు నెలలకు ఓసారి 150 నుంచి 180 కిలోల పట్టు గూళ్లు ఉత్పత్తి చేయవచ్చని వెల్లడించారు. పట్టు పురుగుల పెంపకానికి అవసరమైన షెడ్డు నిర్మాణానికి పట్టు పరిశ్ర మ శాఖ రూ.లక్ష నగదు సబ్సిడీ ఇస్తున్నట్లు చెప్పారు.

స్టాండ్లను రూ.16,500 సబ్సిడీపై ఇస్తున్నట్లు వెల్లడించా రు. పట్టు పురుగులు గూళ్లు కట్టే 250 నేత్రికలు రైతులకు ఉచితంగా ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు. కిలో పట్టుగూళ్లు ఉ త్పత్తిచేస్తే రూ.50 సబ్సిడీ వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టు పరిశ్రమ శాఖ సాంకేతిక అధికారి వసంతరాయులు, మండల వ్యవసాయాధికారి సుమతి, మండల వ్యవసాయ విస్తరణ అధికారులు జయంతి, నీలిమ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు