అబ్బురం.. సన్యాసి గుహల అందాలు

22 Aug, 2019 08:33 IST|Sakshi
సొరంగంలా ఉన్న గుహ

సాక్షి, బేతంచెర్ల(కర్నూలు) : బుగ్గానిపల్లె గ్రామ సమీపంలో పచ్చని అటవీ ప్రాంతంలో సన్యాసి గుహలు ప్రకృతి ప్రేమికులను అబ్బుర పరుస్తున్నాయి. ఇక్కడ పూర్వం ఓ సన్యాసి ఉండేవాడని, అందుచేత వాటికి సన్యాసి గుహలుగా పేరు వచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు. బుగ్గానిపల్లె, సిమెంట్‌నగర్, పాణ్యం మండలం కందికాయపల్లె, బనగానపల్లె మండలం రామతీర్థం ప్రజలకు తప్ప.. గుహలు ఉన్నట్లు వేరెవరికీ తెలియదు.

బుగ్గానిపల్లె గ్రామం నుంచి 4 కిలో మీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఈ గుహలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. సరైన రహదారి లేకపోయినా స్థానికులు ఏడాదికోసారైనా గుహల అందాలను చూసి సంభ్రమాశ్చర్యాలకు గురువుతున్నారు. గుహల్లో నాగశేషుని ఆకారం, రాజుల కట్టడాలు, నీరు పారుతున్నట్లుగా, జంతువుల ఆకారాలు, గాజుతో తయారైన చిత్రాలు అబ్బుర పరుస్తున్నాయి. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, రోడ్డు సౌకర్యం కల్పించి, గుహలను అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.  

మరిన్ని వార్తలు