అందాల తాండవం

2 Nov, 2014 01:52 IST|Sakshi
అందాల తాండవం
  •  పిక్నిక్ స్పాట్‌గా అలరిస్తున్న రిజర్వాయర్
  •  కార్తీక మాసంలో రెండు జిల్లాల నుంచి సందర్శకుల తాకిడి
  • నాతవరం: రెండు కొండల మధ్య చూడ చక్కని విధంగా సర్వాంగసుందరంగా నిర్మించిన తాండవ  రిజర్వాయర్ పిక్నిక్ స్పాట్‌గా ఆకర్షిస్తోంది. పచ్చని రెండు కొండల నడుమ గట్టు  లోపల భాగాన  నిండుకుండలా దర్శనమిచ్చే రిజర్వాయర్‌లో గాలులకు కెరటాలతో ఎగిసిపడే నీరు.. రిజర్వాయర్ దిగువన రెండు కాలువల ద్వారా గలగలలాడుతూ పంట పొలాలకు ప్రవహించే నీరు.. చుట్టూ కిలకిలమంటూ పక్షులు  కోలాహలం.. మనసును ఉత్తేజపరిచే తాండవ డ్యామ్‌పై వీచే చక్కటి గాలి పర్యాటకులను ఎంతగానో అకట్టుకుంటాయి.

    రిజర్వాయర్ గట్టుపై నుంచి చూస్తే ఓపక్క కునుచూపు మేర తాండవ రిజర్వాయర్‌లో నీటిమట్టం, మరో పక్క ఆహ్లాదాన్ని నింపే పచ్చటి పంట పొలాలు,  రిజర్వాయర్‌లో బోటు షికారు మరిచిపోలేని అనుభూతిని పర్యాటకులకు కలిగిస్తుంది. ఏటా కార్తీక మాసం  ప్రారంభం నుంచి విశాఖ, తూర్పుగోదావరి  జిల్లాల  నలు మూలలు నుంచి పర్యాటకులు తాండవ రిజర్వాయర్‌ను సందర్శిస్తుంటారు. తాండవ డ్యామ్ దిగువన పురాతన శ్రీనల్లకొండమ్మ తల్లి ఆమ్మవారి ఆలయం ఉంది. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు అమ్మవారిని దర్శించుకుంటారు.

    ఆ తర్వాత తాండవ అందాలను తిలకించి డ్యామ్ నుంచి సూమారు  3 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్పిల్‌వే గేట్లను సందర్శిస్తారు. రిజర్వాయర్ నిర్మాణ సమయంలో తాండవనీరు ప్రమాదస్థాయికి వచ్చిన పుడు దాని నివారణకు  రెండు కొండలను  చీల్చి  నీరు నదిలోకి పోయేందుకు  పొర్లుకట్ట నిర్మించారు.

    అప్పట్లో రిజర్వాయర్ నిర్మాణం కంటే  స్పిల్‌వే గేట్ల నిర్మాణానికి అధికంగా ఖర్చయినట్లు అధికారులు చెబుతున్నారు. అది చూడటానికి  పర్యాటకులు ఉత్సాహం  కనబరుస్తారు. పర్యాటకులు తాండవలో తిరి గేందుకు  1989లో ఇంజిన్ బోట్లు కూడా మం జూరు చేశారు. క్రమేపీ పర్యవేక్షణ లోపం కారణంగా అవి ప్రసుత్తం అందుబాటులో లేవు.  పర్యాటకుల కోరిక మేరకు స్థానికంగా ఉన్న మత్స్యకారులు కిరాయికి తాండవలో బోటు పై తిప్పతుంటారు.
     
    కార్తీక మాసంలో రెండు జిల్లాల నుంచి  విద్యార్థులు పిక్నిక్ పేరుతో బస్సుపై  వస్తుంటారు.   అమ్మవారి గుడి ప్రాంగణంలో ఉసిరి చెట్టుతో పాటు చల్లని నీడ నిచ్చే చెట్లు  ఉండటంతో కార్తీక సమారాధన   పేరుతో వన భోజనాలు చేస్తారు. కార్తీక మాసం నెలలో ప్రతి ఆదివారం ఈ ప్రాంతమంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు సందర్శకులతో కిక్కిరిసి పోయి ఉంటుంది.  
     
    తాండవ వెళ్లటానికి బస్సు  సౌకార్యం
    ప్రతి రోజు  న ర్సీపట్నం నుంచి ఉదయం 6, 7, 9,12 గంటలకు, మధ్యాహ్నం 3, 6, 9.30 గంటలకు డిపో నుంచి ఆర్టీసీ బస్సులు ఉన్నా యి.  తాండవ జంక్షన్  నుంచి నిత్యం ఆటోలు, ఇతర ప్రయివేటు వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయి. నర్సీపట్నం నుంచి తాండవకు  27 కిలో మీటర్ల దూరం ఉంది.
     

>
మరిన్ని వార్తలు