లబ్ధిదారులు అండగా ఉండాలి

6 Nov, 2016 02:07 IST|Sakshi
లబ్ధిదారులు అండగా ఉండాలి

కర్నూలు సభలో సీఎం చంద్రబాబు పిలుపు
 
 సాక్షి ప్రతినిధి, కర్నూలు: ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందినవారు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని సీఎం ఎన్.చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని.. అందుకే ఓట్లు వేయమని అడుగుతామన్నారు. డ్వాక్రా సంఘాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. కర్నూలులో అమృత్ పథకం కింద రూ.12 కోట్లతో చేపట్టనున్న సిటీ పార్కుతోపాటు వివిధ అభివృద్ధి పథకాలకు సీఎం శనివారం శంకుస్థాపన చేశారు.

అనంతరం కిడ్‌‌స వరల్డ్ పార్కు నుంచి నెహ్రూరోడ్-మెరుున్‌రోడ్ సర్కిల్ వరకూ టీడీపీ జనచైతన్య యాత్రలో పాల్గొన్నారు. అక్కడ్నుంచీ ప్రత్యేక బస్సులో వెళ్లి కోల్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. తర్వాత అవుట్‌డోర్ స్టేడియంలో మహిళాసంఘాల సభ్యులతో ఏర్పాటు చేసిన ముఖాముఖీ కార్యక్రమంలో మాట్లాడారు.
 
 ఓటుకు నోటు కేసుతో నాకేం సంబంధం?
 కొద్ది మంది వ్యక్తులు, ప్రతిపక్షాలు తనపై బురద జల్లుతున్నాయని.. అరుునప్పటికీ ఎవ్వరికీ భయపడనని సీఎం అన్నారు. ప్రత్యేక హోదా గురించి పోరాటాలు చేస్తున్నారని... ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయా? అని ప్రశ్నించారు. అన్నీ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో తాను భయపడుతున్నానని ప్రచారం చేస్తున్నారని, ఆ కేసుతో నాకేమీ సంబంధమని చంద్రబాబు అన్నారు. నేనేమైనా డబ్బులు ఇచ్చానా? అని వ్యాఖ్యానించారు. తనపై దాడి చేసినవారికే భయపడలేదన్నారు.

మరిన్ని వార్తలు