కేంబ్రిడ్జి నుంచి విజ్ఞాన్ వర్సిటీకి ఉత్తమ అవార్డు

28 Jul, 2015 01:35 IST|Sakshi

చేబ్రోలు: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీకి ఉత్తమ అవార్డు దక్కిందని వర్సిటీ ఎస్ అండ్ ెహ చ్(సైన్స్ అండ్ హ్యుమనిటీస్) విభాగాధిపతి ఎన్.శ్రీనివాసులు తెలిపారు. సోమవారం యూనివర్సిటీలోని తన చాంబర్‌లో ఆయన మాట్లాడుతూ యూకేలోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ తమ ‘ఉత్తమ భాగస్వామ్య విద్యాసంస్థ’గా విజ్ఞాన్ యూనివర్సిటీని ఎంపిక చేసిందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యార్థులు ఆంగ్ల భాషా నైపుణ్యం పెంపొందించుకోవడంలో విజ్ఞాన్ అత్యంత ప్రభావం చూపిందని, అందుకే ఈ అవార్డుకు ఎంపిక చేసిందని పేర్కొన్నారు.

కేంబ్రిడ్జి యూనివర్సిటీ కో ఆర్డినేటర్లకు హైదరాబాద్‌లో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారని, తమకు అవార్డు ప్రదానం చేశారని పేర్కొన్నారు. ఆంగ్ల అధ్యాపకురాలు శారద, ఎస్ అండ్ హెచ్ విభాగ అధ్యాపకుడు కె.రవీంద్రబాబు ఈ అవార్డును స్వీకరించారని వివరించారు. అవార్డుకు ఎంపికయ్యేందుకు కృషి చేసిన సిబ్బందికి విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు, యూనివర్సిటీ వీసీ సి.తంగరాజన్ తదితరులు అభినందనలు తెలిపారు.
 
 
 

మరిన్ని వార్తలు