పంచాయతీలకు ‘ఉత్తమ’ గుర్తింపు

13 Sep, 2019 11:18 IST|Sakshi
మండల స్థాయిలో ఉత్తమ పంచాయతీగా ఎంపికైన మలిచర్ల

జిల్లా స్థాయి ఉత్తమ పంచాయతీగా బొండపల్లి

ఉత్తమ పంచాయతీల ఖాతాల్లోకి రూ.65.50 లక్షల నిధులు జమ

సాక్షి, విజయనగరం రూరల్‌: తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, ఇంటి పన్నుల వసూలు, జీపీడీఏ, ఆడిట్‌ నిర్వహణ వంటి ఐదు అంశాలలో చూపిన ప్రగతి ఆధారంగా ప్రభుత్వం ఉత్తమ పంచాయతీలను ఎంపిక చేసింది. జిల్లా, మండల స్థాయిలో ఎంపికైన పంచాయతీలకు నగదు బహుమతులను ఆయా పంచాయతీల ఖాతాలకు జమచేసింది. 2016–17 సంవత్సరానికి గాను జిల్లాలోని 34 మండలాల్లో జిల్లా స్థాయిలో గరివిడి మండలం బొండపల్లి గ్రామ పంచాయతీ ప్రథమ స్థానంలో నిలిచింది.

చీపురుపల్లి మండలం కర్లాం రెండో స్థానం, మెంటాడ మండలం బుచ్చిరాజుపేట పంచాయతీకి మూడో స్థానం దక్కింది. మొదటి బహుమతి కింద రూ.3 లక్షలు, రెండో బహుమతి సాధించిన పంచాయతీకి రూ.2 లక్షలు, మూడో స్థానం సాధించిన పంచాయతీకి రూ.లక్ష బహుమతిగా పంచాయతీల ఖాతాల్లో అధికారులు జమ చేశారు. మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన పంచాయతీలకు మొదటి బహుమతి కింద రూ.లక్ష, రెండో స్థానం సాధించిన పంచాయతీకి రూ.75 వేలు నగదు బహుమతిని పంచాయతీ ఖాతాల్లో సీఎఫ్‌ఎంఎస్‌ విధానంలో నిధులు జమ చేశారు.

పోటీతత్వంతోనే అభివృద్ధి
ఏటా పంచాయతీల్లో జరిగే ఐదు అంశాల ప్రగతి ఆధారంగా ఉత్తమ పంచాయతీలుగా ఎంపికచేస్తారు. పంచాయతీల మధ్య పోటీతత్త్వం ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. గ్రామాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అవసరం ఎంతైనా ఉంది. 
 – బి.సత్యనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఖర్చు సొసైటీది.. ఆదాయం టీడీపీది

మొక్కలు నాటడంలో జిల్లా ముందంజ

నన్నపనేని వ్యాఖ్యలపై ఆగ్రహ జ్వాలలు

జైలు జీవితం నుంచి జనజీవనంలోకి..

షార్‌లో హై అలర్ట్‌..

‘షాక్‌’ ట్రీట్‌మెంట్‌.. సస్పెన్షన్‌

కష్టాల వేళ.. సర్కారు చేయూత

‘బాబూ.. వారిని ఆదుకోండి లేకపోతే లావైపోతారు’

ఆత్మకూరులో అసలేం జరిగింది?

నన్నపనేని వ్యాఖ్యలపై దళితుల ఆగ్రహావేశాలు

యూనివర్సిటీలు ఇక మానవాభివృద్ధి కేంద్రాలు

కానిస్టేబుల్‌ ఫలితాల విడుదల

ఉన్నత విద్యా కమిషన్‌ చైర్మన్‌గా జస్టిస్‌ ఈశ్వరయ్య

డెంగీ, మలేరియాకు ఆరోగ్యశ్రీ

నాలుగేళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి

గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో పీవీ సింధుకు ఘనస్వాగతం

సీఎం జగన్‌ పాలనపై తెలంగాణ మంత్రి ప్రశంసలు

ఈనాటి ముఖ్యాంశాలు

ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌గా చంద్రశేఖర్‌రెడ్డి

అవసరమైతే పల్లెనిద్ర: డిప్యూటీ సీఎం ఆళ్ల నాని

అచ్చెన్నాయుడు శ్రీకాకుళం పరువు తీస్తున్నారు..

సుజనా అడిగితే సీఎం వచ్చి చెప్పాలా?

అహంకారంతో విర్రవీగితే చూస్తూ ఊరుకోం...

వరద జలాలను ఒడిసి పట్టాలి: సీఎం జగన్‌

అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఇన్సూరెన్స్‌

టూవీలర్లకు ఈ పథకం వర్తించదు : మంత్రి

ఎస్‌ఐ అనురాధ ఫిర్యాదు, నన్నపనేనిపై కేసు

15న ఏపీ లోకాయుక్తగా జస్టిస్‌ లక్ష్మణ్‌రెడ్డి ప్రమాణం

ఓడినా.. టీడీపీ నేతలకు ఇంకా బుద్ధి రాలేదు..

అరచేతిలో ఆర్టీసీ సమాచారం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

యంగ్‌ టైగర్‌ వర్సెస్‌ రియల్‌ టైగర్‌?

ప్రేమలో ఉన్నా.. పిల్లలు కావాలనుకున్నప్పుడే పెళ్లి!

ఆ దర్శకుడిపై కేసు వేస్తా: జయలలిత మేనల్లుడు

హ్యాట్రిక్‌కి రెడీ

అందుకే నటించేందుకు ఒప్పుకున్నా

ఫుల్‌ జోష్‌