ఇక పావురాలతో పందేలు

9 Jan, 2017 01:59 IST|Sakshi
ఇక పావురాలతో పందేలు

నెల్లూరు జిల్లాలో చెన్నైకి చెందిన జూదరులు.. రూ. లక్షల్లో పందేలు

చావలి (పెళ్లకూరు): సంక్రాంతి పండుగ వస్తే  కోడి పందేలు నిర్వహించడం చూశాం. అయితే ఇప్పుడు కొందరు జూదరులు పావురాల పందేలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం చావలి గ్రామ సమీపంలో ఆదివారం జరిగింది. నాయుడుపేట– పూతలపట్టు జాతీయ రహదారి మార్గంలో ఎగువచావలి, దిగువచావలి గ్రామాల మధ్యలో చెన్నైకి చెందిన కొందరు   రెండు లారీల్లో అక్కడకు చేరుకున్నారు.

లారీల్లోని ప్రత్యేక పెట్టెల్లో ఉంచిన పావురాలను కిందకు దించి వాటి కాళ్లకు దారాలు కట్టి వందల కొద్ది పావురాలను గాల్లోకి విడిచిపెట్టారు. అవి గుంపులు గుంపులుగా చెన్నై వైపు ఎగిరిపోయాయి. వెంటనే వాటిని అనుసరిస్తూ జూదరులు వచ్చిన వాహనాల్లో చెన్నైవైపు వెళ్లిపోయారు. కాగా ఎవరి పావురాలు  తిరిగి అవి ఉంటున్న ప్రదేశానికి వెళతాయో వారు పందెం గెలిచినట్టని, ఇందుకు సంబంధించి రూ. లక్షల్లో పందేలు కాస్తున్నారని సమాచారం.

మరిన్ని వార్తలు