వంశధార స్థలం ఆక్రమణ వాస్తవమే..

28 Jul, 2019 09:48 IST|Sakshi
వంశధార గట్టు సమీపంలో బెవరేజ్‌ స్థలంలో సర్వే చేస్తున్న అధికారులు

బెవరేజ్‌ గొడౌన్‌ నిర్మించినట్లు గుర్తింపు

వీఆర్‌కే పురం మార్గంలో రెవెన్యూ అధికారుల పరిశీలన 

టెక్కలి: మండలంలో వీఆర్‌కే పురం గ్రామానికి వెళ్లే మార్గంలో వంశధార స్థలాన్ని ఆక్రమించి బెవరేజ్‌ (మద్యం నిల్వ కేంద్రం) గొడౌన్‌ నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. శనివారం రెవెన్యూ, వంశధార అధికారులు సంయుక్తంగా పరిశీలించి ఈ ఆక్రమణలను గుర్తించారు. ఇక్కడ కాలువలు నిర్మించకుండా గొడౌన్‌ ఏర్పాటుతో పొలాలకు ముంపు ప్రమాదం ఉందని, అలాగే వంశధార గట్టుపై అక్రమ తవ్వకాలు చేశారంటూ వీఆర్‌కే పురం, సీతాపురం గ్రామస్తులు ఇటీవల స్పందనలో అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్‌ఐ హరి, సర్వేయర్లు సుభాష్, రమణమూర్తి, వంశధార ఏఈ యామిని తదితరులు ఫిర్యాదుదారులు, గ్రామస్తుల సమక్షంలో బెవరేజ్‌కు ఆనుకున్న వంశధార స్థలంలో కొలతలు వేశారు. చివరగా వంశధార స్థలాన్ని ఆక్రమించి బెవరేజ్‌ నిర్మాణం జరిగినట్లు గుర్తించారు. ఈ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని అధికారులు పేర్కొన్నారు. దీనిపై అధికారులు పూర్తిస్థాయిలో తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బోల్‌ భం భక్తుల దుర్మరణం

క్షణ క్షణం.. భయం భయం

గ్రామసచివాలయాల్లో కొలువుల జాతర

నిధుల కొరత లేదు: మంత్రి బుగ్గన

టిక్‌‘ట్రాప్‌’లో శక్తి టీమ్‌ 

ఆ భోజనం అధ్వానం

మంత్రి అవంతి గరం గరం..

రైల్వే ప్రయాణికుడి వీరంగం

వీరులార మీకు పరి పరి దండాలు!

చేతకాకపోతే చెప్పండి.. వెళ్లిపోతాం!

అమాయకుడిపై ఖాకీ ప్రతాపం 

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎస్పీ

80% ఉద్యోగాలు స్థానికులకే.. 

నా కుమారుడు చచ్చినా పర్వాలేదు

మలేషియా జైలులో గుంటూరు జిల్లా వాసి

‘ఇది ఎమ్మెల్యే కాలేజీ.. దిక్కున్నచోట చెప్పుకోండి’

దావోస్‌లో ఏపీ లాంజ్‌ ఖర్చు రూ.17 కోట్లు

ప్రభుత్వ మద్యం షాపులకు ప్రతిపాదనలు సిద్ధం!

యజ్ఞంలా ‘నివాస స్థలాల’ భూసేకరణ 

‘జగతి’ ఎఫ్‌డీఆర్‌ను వెంటనే విడుదల చేయండి 

ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ ఇక పక్కాగా..

విశాఖ ఏజెన్సీని ముంచెత్తిన వర్షాలు

గాంధీ జయంతి నుంచి.. గ్రామ సురాజ్యం

పెట్టబడుల ఆకర్షణకై రాష్ట్ర ప్రభుత్వం భారీ సదస్సు

ఈనాటి ముఖ్యాంశాలు

‘అది సాహసోపేతమైన నిర్ణయం’

బాధ్యతలు చేపట్టిన ఆర్టీజీఎస్‌ నూతన సీఈవో

పొనుగుపాడు ఘటనపై స్పందించిన హోంమంత్రి

‘చంద్రబాబు డైరెక‌్షన్‌లో మందకృష్ణ మాదిగ’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అక్షరా’లా అది నా ఆరో ప్రాణం..

హీరో సూరి

డూప్‌ లేకుండానే...

తొలి అడుగు పూర్తి

నా కామ్రేడ్స్‌ అందరికీ థ్యాంక్స్‌

హాసన్‌ని కాదు శ్రుతీని!