పోలీసుల తీరుపై లాయర్స్‌ ఫైర్‌..

20 Feb, 2018 11:09 IST|Sakshi

సాక్షి, విజయవాడ: బెజవాడ పోలీసులు ఓ న్యాయవాదిపై అక్రమంగా రౌడీషీట్‌ నమోదు చేశారు. దీనిపై ఆగ్రహించిన బెజవాడ బార్‌ అసోసియేషన్ నేటి నుంచి నాలుగు రోజుల పాటు కోర్టుల బహిష్కరణకు  పిలుపునిచ్చింది. ఈ రోజు నుంచి న్యాయవాదులు కోర్టు సెంటర్‌లో నిరసన దీక్షలు చేపట్టునున్నారు. బెజవాడ పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి. భవానీపురం పోలీస్‌ స్టేషన్‌లో న్యాయవాదిపై నమోదు చేసిన రౌడీషీట్‌ ఉపసంహరించుకోవాలని బార్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. 

న్యాయవాదులు పోలీసుల వేధింపులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో పోలీస్‌ ఉన్నతాధికారులు ఏవిధమైన చర్యలు తీసుకోలేదు. దీంతో లాయర్స్‌ తీవ్ర ఆందోళనకు దిగారు.

మరిన్ని వార్తలు