నవనిర్మాణ దీక్షకు బెజవాడలో ట్రాఫిక్ మళ్లింపు : సీపీ

1 Jun, 2016 00:52 IST|Sakshi

నవనిర్మాణ దీక్షకు విస్తృత ఏర్పాట్లు : కలెక్టర్

 

విజయవాడ : నగరంలో జూన్ రెండో తేదీన ప్రభుత్వం నిర్వహించే నవ నిర్మాణ దీక్ష సందర్భంగా జాతీయ రహదారులు, నగరంలో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపడుతున్నట్లు నగర పోలీసు కమిషనర్ డి.గౌతం సవాంగ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ దీక్షకు హాజరవుతున్నందున ఆ రోజు ఉదయం నాలుగు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు చర్యలు, పార్కింగ్ ఏర్పాట్లు చేపట్టామని వివరించారు. గుంటూరు నుంచి విజయవాడ మీదుగా వెళ్లే వాహనాలను సత్తెనపల్లి - పిడుగురాళ్ల - మిర్యాలగూడ - నార్కెట్‌పల్లి మీదుగా హైదరాబాద్‌కు మళ్లిస్తామని పేర్కొన్నారు.

 
విశాఖపట్నం, హైదరాబాద్ మధ్య ఇలా..

విశాఖపట్నం నుంచి దేవరపల్లి - సత్తుపల్లి - తల్లాడ -ఖమ్మం - సూర్యారావుపేట మీదుగా హైదరాబాద్‌కు మళ్లిస్తారు. మరో మార్గంలో హనుమాన్‌జంక్షన్ నుంచి నూజివీడు -విస్సన్నపేట -కల్లూరు -వైరా, ఖమ్మం మీదుగా లేదా హనుమాన్‌జంక్షన్ - నూజివీడు -మైలవరం - ఇబ్రహీంపట్నం మీదుగా లేదా హైదరాబాద్ నుంచి సూర్యారావుపేట - ఖమ్మం - తల్లాడ - సత్తుపల్లి - దేవరపల్లి మీదుగా విశాఖపట్నం వెళ్తాయి. హైదరాబాద్ నుంచి సూర్యాపేట - ఖమ్మం - వైరా -కల్లూరు - విస్సన్నపేట - నూజి వీడు - హనుమాన్‌జంక్షన్ మీదుగా లేదా  ఇబ్రహీం పట్నం - మైలవరం - నూజివీడు - హనుమాన్‌జంక్షన్ మీదుగా విశాఖపట్నం వెళ్తాయి.

 
వైజాగ్, చెన్నయ్ మధ్య ఇలా..

విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా చెన్నయ్ వెళ్లే వాహనాలను హనుమాన్‌జంక్షన్ నుంచి గుడివాడ - పామర్రు - చల్లపల్లి - అవనిగడ్డ - బాపట్ల - ఒంగోలు మీదుగా చెన్న య్‌కు మళ్లిస్తారు. చెన్నయ్ వైపు నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం వెళ్లే వాహనాలను ఒంగోలు - త్రోవగుంట - బాపట్ల - అవనిగడ్డ - చల్లపల్లి - పామర్రు - గుడివాడ - హనుమాన్‌జంక్షన్ మీదుగా విశాఖపట్నం మళ్లిస్తారు.

 
హైదరాబాద్ నుంచి చెన్నయ్

నార్కెట్‌పల్లి  -  నల్గొండ - మిర్యాలగూడ - పిడుగురాళ్ల - అద్దంకి - మేదరమెట్ల - ఒంగోలు మీదుగా చెన్నయ్ వెళ్తాయి. చెన్నయ్ నుంచి వచ్చే వాహనాలు ఒంగోలు, మేదరమెట్ల - అద్దంకి - పిడుగురాళ్ల - మిర్యాలగూడ - నల్గొండ -నార్కెట్‌పల్లి మీదుగా హైదరాబాద్ వెళ్తాయి.

 
మచిలీపట్నం, చెన్నయ్ మధ్య ఇలా..

మచిలీపట్నం వైపు నుంచి విజయవాడ మీదుగా చెన్నయ్ వెళ్లే వాహనాలను, మచిలీపట్నం, పామర్రు, చల్లపల్లి, అవనిగడ్డ, బాపట్ల, ఒంగోలు, మీదుగా చెన్నైకు మళ్లిస్తారు. చెన్నయ్ నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం వెళ్లే వాహనాలను ఒంగోలు, బాపట్ల, అవనిగడ్డ, చల్లపల్లి, పామర్రు మీదుగా మచిలీపట్నం మళ్లిస్తారు.

 
మచిలీపట్నం, హైదరాబాద్ మధ్య..

మచిలీపట్నం వైపు నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలను పామర్రు, హనుమాన్‌జంక్షన్ నుంచి నూజి వీడు, విస్సన్నపేట, కల్లూరు, వైరా, ఖమ్మం, సూర్యాపేట మీదుగా హైదరాబాద్‌కు మళ్లిస్తారు. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను సూర్యారావుపేట, ఖమ్మం, వైరా, కల్లూరు, విస్సన్నపేట, నూజివీడు, హనుమాన్‌జంక్షన్, పామర్రు మీదుగా మచిలీపట్నం మళ్లిస్తారు.

 

విజయవాడలో ట్రాఫిక్ ఇలా...
బహిరంగ సభకు హాజరయ్యే ఆహూతులు, ప్రజల వాహనాలను కూడా వివిధ మార్గాల్లో మళ్లిస్తారు.స్వరాజ్యమైదానం నుంచి బెంజిసర్కిల్ వైపు వెళ్లే వాహనాలు హోటల్ డీవీ మనార్ వరకు అనుమతి స్తారు. అక్కడి నుంచి సభాస్థలికి నడిచి వెళ్లాలి. ఇక్కడ ప్రజలను దింపిన తరువాత వాహనాలను పీబీ సిద్ధార్థ కళాశాల, సిద్ధార్థ అకాడమీ, సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్, సిద్ధార్థ మహిళా కళాశాల ప్రాంగణాల్లో నిలపాలి.

 
బందరు రోడ్డుపై మచిలీపట్నం నుంచి వచ్చే వాహనాలు ఎన్‌టీఆర్ సర్కిల్ వరకు అనుమతిస్తారు. అక్కడి నుంచి నడిచి సభాస్థలికి వెళ్లాలి. వారి వాహనాలను పంట కాలువ రోడ్డులో, లేదా దానికి అనుబంధమైన రోడ్లలో ఖాళీ ప్రదేశాల్లో రోడ్లకు ఒక పక్కగా పార్కింగ్ చేసుకోవాలి. అవసరాన్ని బట్టి హైస్కూల్ ఆవరణలో వాహనాలను పార్కింగ్‌కు అనుమతిస్తారు.

 
గుంటూరు వైపు నుంచి జాతీయరహదారి మీదుగావచ్చే వాహనాలను పకీరు గూడెం జంక్షన్ వరకు అనుమతిస్తారు. అక్కడి నుంచి ప్రజలు నడిచి బెంజిసర్కిల్‌కు వెళ్లాలి. వారి వాహనాలు పకీరు గూడెం వద్ద యూటర్న్ తీసుకుని స్క్రూబ్రిడ్జి మీదుగా కృష్ణలంక కట్ట ఫీడర్ రోడ్డు దూరదర్శన్ క్వార్టర్స్‌కు ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో నిలపాలి.

 
గన్నవరం నుంచి జాతీయరహదారి మీదుగా విజయవాడ వచ్చే వాహనాలను నిర్మలా కాన్వెంటు జంక్షన్ వరకు అనుమతిస్తారు. వాహనాలను నిర్మలా కాన్వెంటు ఆవరణలో పార్కింగ్ చేసుకోవాలి. వాహనాలు ఎక్కువగా ఉంటే మేరి స్టెల్లా కళాశాలలో పార్కింగ్‌కు అనుమతిస్తారు. 

 
ఏలూరు నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్‌కు వచ్చే వాహనాలను రామరవప్పాడు రింగ్ రోడ్డు మీదుగా ఏలూరు రోడ్డు, పోలీసు కంట్రోల్ రూం మీదుగా పండిట్ నెహ్రూ బస్టాండ్‌కు మళ్లించారు.

 
పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి ఏలూరు వచ్చే వాహనాలు పోలీసు కంట్రోల్ రూం మీదుగా ఏలూరు రోడ్డు - రామవరప్పాడు రింగ్ మీదుగా ఏలూరుకు మళ్లిస్తారు. మచిలీపట్నం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్‌కు వచ్చే వాహనాలను తాడిగడప, వంద అడుగుల రోడ్డు మీదుగా మళ్లించి ఎనికేపాడు, రామరవప్పాడు రింగ్, ఏలూరు రోడ్డు, పోలీసు కంట్రోల్ రూం మీదుగా పండిట్ నెహ్రూ బస్టాండ్‌కు మళ్లిస్తారు.

 

 

మరిన్ని వార్తలు