భద్రాచలం మాదే

10 Nov, 2013 04:17 IST|Sakshi

 కామారెడ్డి, న్యూస్‌లైన్ :  రాజ్యాన్నే ధిక్కరించి కంచర్ల గోపన్న (రామదాసు) రాములోరి గుడి నిర్మించిన భద్రాచలం ప్రాంతాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోమంటున్నారు తెలంగాణ విద్యార్థులు. భద్రాచలాన్ని తెలంగాణ ప్రాంతం నుంచి వేరుచేసే కుట్రలను నిరసిస్తూ టీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో శనివారం కామారెడ్డిలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చందు మాట్లాడుతూ పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఇస్తామన్న సీడబ్ల్యూసీ, యూపీఏ తీర్మానాలను విస్మరిస్తూ కేంద్రమంత్రి జైరాం రమేశ్ భద్రాచలాన్ని సీమాంధ్రలో కలపాలని సూచించడం గర్హనీయమన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌వీ నేతలు సంతోష్, సుమన్, రాజు, నిరం జన్, ప్రవీన్, మహేశ్, ప్రభాకర్, విఠల్, అశోక్ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు