జవాన్‌కు షోకాజ్‌ నోటీస్‌ ఇవ్వండి

31 Mar, 2020 12:37 IST|Sakshi
కూరగాయల మార్కెట్‌లో దుకాణాలు దూరంగా ఉంచాలని సూచిస్తున్న భద్రాద్రి కలెక్టర్‌ ఎంవీ.రెడ్డి

ఇల్లెందు: కరోనా నివారణ చర్యల్లో భాగంగా సోమవారం పట్టణంలో భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ ఎంవీ.రెడ్డి  పర్యటించారు. జేకే బస్టాఫ్‌ ఏరియాలో ఏర్పాటు చేసిన మినీ మార్కెట్‌ను, లలిత కళామందిర్‌ ఏరియాలో సైడు కాలువలను క్లీన్‌ చేస్తున్న తీరును పరిశీలించారు. కాలువలో పేరుకుపోయిన చెత్తను చూసి శుభ్రం చేయటం లేదా అని ప్రశ్నించారు. మున్సిపల్‌ జవాన్‌కు షోకాజ్‌ నోటీస్‌ జారీ చేయాలని ఆదేశించారు. ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్లి హోం క్వారంటైన్‌ పాటిస్తున్న తీరును అడిగి  తెలుసుకున్నారు అనంతరం టౌన్‌ కూరగాయల మార్కెట్‌ను సందర్శించారు. కలెక్టర్‌ వెంట ఎమ్మెల్యే బానోతు హరిప్రియ, మున్సిపల్‌ చైర్మన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు (డీవీ), వైస్‌ చైర్మన్‌ సయ్యద్‌ జానీపాషా, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ దిండిగాల రాజేందర్, ఆర్డీఓ స్వర్ణలత,  తహసీల్దార్‌ మస్తాన్‌రావు, మున్సిపల్‌ కమిషనర్‌ ఏ.శ్రీనివాసరెడ్డి, డాక్టర్‌ వరుణ్, సిబ్బంది, కౌన్సిలర్లు ఉన్నారు.

వలస కార్మికులను ఆదుకోండి
ఇల్లెందు: ఇటుక బట్టీలో పనిచేస్తున్న వలస కార్మికులకు ఆహారం అందించి ఆదుకోవాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఇల్లెందు పర్యటన సందర్భంగా మండలంలోని మర్రిగూడెంలోని ఇటుక బట్టీలను సందర్శించి అక్కడి వలస కూలీలతో మాట్లాడారు.

మరిన్ని వార్తలు