రాబోయే కాలానికి కాబోయే ఓటర్లు మీరే..

1 Aug, 2017 21:13 IST|Sakshi
రాబోయే కాలానికి కాబోయే ఓటర్లు మీరే..
► రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌
గుంతకల్లు(అనంతపురం)‌: రాబోయే కాలానికి కాబోయే ఓటర్లు మీరే అని ఇంటర్‌ విద్యార్థులను ఉద్దేశించి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ అన్నారు. మంగళవారం గుంతకల్లులోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ‘రాబోయే కాలానికి కాబోయే ఓటర్లు’  కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన భన్వర్‌లాల్‌ ఓటు నమోదు, దాని ప్రాధాన్యం గురించి ఇంటర్‌ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే నాయకులకు ఓటు వేయకూడదన్నారు.

బాధ్యత గల పౌరులుగా మంచి నేతలను ఎన్నుకోవాలని సూచించారు. 2014 ఎన్నికల్లో గుంతకల్లు నియోజకవర్గంలో 65 శాతం పోలింగ్‌ నమోదైందని.. వచ్చే ఎన్నికల్లో 100 శాతం నమోదు కావాలన్నారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రమామణి, జెడ్పీ సీఈఓ సూర్యనారాయణ, ఆర్డీఓ మలోల, తహసీల్దార్‌ హరిప్రసాద్, ప్రిన్సిపల్‌ శ్రీనివాసులు, మున్సిపల్‌ డెలిగేట్‌ కమిషనర్‌ ఈశ్వరయ్య, ఏసీపీ శివనారాయణ, ఎంపీడీఓ శంకర్, గుత్తి డీటీ మునివేలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు