భరతనాట్యం.. దేశానికి వరం

29 Jan, 2014 02:30 IST|Sakshi
భరతనాట్యం.. దేశానికి వరం

 సాక్షి, సిటీబ్యూరో: భరతనాట్యం దేశానికి వరమని హైకోర్టు జస్టిస్ నూతి రామ్మోహనరావు తెలిపారు. మంగళవారం రవీంద్రభారతిలో అభినేత్రి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ‘ప్రణామ్’ కార్యక్రమంలోని ఆయన పాల్గొని ప్రసంగించారు. పాశ్చాత్య పెనుగానులు వీస్తున్న తరుణంలో భారతీయ విలువలు ఎక్కడ కొట్టుకపోతాయేనని భయం భయంగా ఉండేదని.. తొమ్మిది మంది చిన్నారుల నృత్యం చూసిన తర్వాత కొంత ధైర్యం వచ్చిందన్నారు. మంజులా శ్రీనివాస్ శిష్యగణం చేసిన దశావతారాల ప్రదర్శన మహాద్భుతంగా సాగిందన్నారు.
 
  పిల్లలు చేసిన శ్రీకృష్ణాభినయం తనను ఎక్కడికో తీసుకెళ్లిందన్నారు. అనంతరం నృత్యగురువు మంజులా శ్రీనివాస్‌ను జస్టిస్ నూతి రామ్మోహనరావు సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ప్రమోద్ కుమార్ రెడ్డి, సుందరి, నర్సింగరావు, మాధవి, రాధారాణి, సాయిశ్రీ, భవాని, అరుణజ్యోతి , శృతి తదితరులు గురువు మంజులాశ్రీనివాస్‌ను ఘనంగా సత్కరించారు. అంతకుముందు తొమ్మిది మంది కళాకారులు ప్రమోద్ కుమార్ రెడ్డి సారధ్యంలో గురువందనమ్‌లో భాగంగా చేసిన చంద్రచోడ, థిల్లానా, మహాలక్ష్మి అష్టకంపై చేసిన నృత్యరూపకాలు ఆకట్టుకున్నాయి. గాయని శ్వేతా ప్రసాద్, గాయకుడు శ్రీనివాస్‌లను జస్టిస్ నూతి రామ్మోహనరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో నృత్యకారిణి  చిత్ర, నృత్యకారుడు ప్రమోద్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు