అస్పత్రి అభివృద్ధికి భారతి సిమెంట్‌ సహకారం

18 Jul, 2020 10:35 IST|Sakshi
ఆసుపత్రిని పరిశీలిస్తున్న జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టరు ఎం సుధీర్‌రెడ్డి, పార్టీ కార్యదర్శి ఎం హర్షవర్థన్‌రెడ్డిలు

రూ.20 లక్షలు సీఎస్‌ఆర్‌ నిధులు మంజూరు

15 పడకలు ఆధునిక పరికరాలతో ఏర్పాటు

ఎమ్మెల్యే డాక్టరు మూలె సుధీర్‌రెడ్డి వెల్లడి

ఎర్రగుంట్ల :ఎర్రగుంట్ల మున్సిపల్‌ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిని అత్యాధునిక వసతులతో, పరికరాలతో అభివృద్ధి చేయడానికి భారతి సిమెంట్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం ముందుకు రావడం సంతోకరమని జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టరు మూలె సుధీర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎర్రగుంట్ల మున్సిపల్‌ పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రిని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి మూలె హర్షవర్థన్‌రెడ్డితో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఎర్రగుంట్ల మున్సిపాలీటీలో గడిచిన 15 ఏళ్లుగా ప్రభుత్వ ఆసుపత్రిని ఏవరూ పట్టించుకోలేదన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక నాడు–నేడు పనులతో పాఠశాలలు అభివృద్ది చేస్తున్నామన్నారు.

ఇక్కడి ఆసుపత్రిలో ఆధునిక వసతులు చాలా ముఖ్యమన్నారు. ఈ నేపథ్యంలో తాను ఎర్రగుంట్ల ఆసుపత్రిని కూడా కమలాపురం ఆసుపత్రి మాదిరిగా అబివృద్ది చేయాలని భారతి సిమెంట్‌ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని కోరినట్లు తెలిపారు. వెంటనే యాజమాన్యం స్పందించిందన్నారు. అడిగిన వెంటనే రూ.20 లక్షలు సీఎస్‌ఆర్‌ నిధులను మంజూరు చేయడం ఆనందం కలిగించిందన్నారు. ఈ నిధులతో 15 పడకలు ఏర్పాటు చేయనున్నామన్నారు. వివిధ పరికరాలను కూడా అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు తెలిపారు. సిమెంట్‌ ఫ్యాక్టరీకి చెంతిన భార్గవర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇంజనీర్లు సందర్శించి ఆధునికంగా తీర్చిద్దిదడానికి  ప్రణాలిక సిద్ధం చేస్తారన్నారు.ఈ సందర్భంగా ఆయన యజమాన్యాన్ని అభినందిస్తున్నామన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి మూలె హర్షవర్థన్‌రెడ్డి, భారతి సిమెంట్‌ ఫ్యాక్టరీ భార్గవరెడ్డి, కమిషనర్‌ వై రంగస్వామిలతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు